Nikhil: కొడుకు పుట్టిన సందర్భంగా నిఖిల్ ఎమోషనల్.. అలా కామెంట్లు చేస్తూ?

  • February 22, 2024 / 06:51 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో నిఖిల్ ఒకరు కాగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటున్న నిఖిల్ తండ్రిగా ప్రమోషన్ పొందారు. కొడుకు పుట్టిన సందర్భంగా నిఖిల్ ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. నిన్న ఉదయం నిఖిల్ భార్య పల్లవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 2020 సంవత్సరంలో నిఖిల్, పల్లవి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

ఏడాది క్రితం చనిపోయిన తండ్రి కొడుకు రూపంలో మళ్లీ పుట్టాడంటూ నిఖిల్ ఎమోషనల్ కామెంట్లు చేశారు. ఏడాది క్రితం నాన్నను కోల్పోయానని నిఖిల్ పేర్కొన్నారు. ఇప్పుడు మా కుటుంబంలోకి మగబిడ్డ అడుగుపెట్టారని ఆయనే మళ్లీ తిరిగి వచ్చాడని అనుకుంటున్నానని నిఖిల్ చెప్పుకొచ్చారు. మాకు అబ్బాయి జన్మించినందుకు చాలా సంతోషంగా ఉందని నిఖిల్ తెలిపారు. నిఖిల్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా చేసిన పోస్ట్ కు దాదాపుగా 2 లక్షల లైక్స్ వచ్చాయి.

కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న (Nikhil) నిఖిల్ స్వయంభూ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నిఖిల్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది. క్లాస్ సినిమాలకు నిఖిల్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. నిఖిల్ హ్యాపీడేస్ సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టగా అప్పటినుంచి ఇప్పటివరకు కెరీర్ పరంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

కెరీర్ పరంగా ఒక్కో మెట్టు ఎదుగుతున్న నిఖిల్ భవిష్యత్తులో మరిన్ని భారీ విజయాలను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రాబోయే రోజుల్లో నిఖిల్ కెరీర్ పరంగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. స్వయంభూ మూవీ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుంది. వైవిధ్యమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus