ఎవడి జీవితానికి వాడే హీరో, నువ్వు చేసే పనులే నీ భవిష్యత్ ను నిర్ణయిస్తాయి అనే మాటలు చిన్నప్పట్నుంచి వింటూనే ఉన్నాం. కానీ.. అల్లు శిరీష్ జీవితం మాత్రం తాను చేసే పనుల వల్ల కాక అవసరాల శ్రీనివాస్ చేసే పనుల మీద ఆధారపడి ఉంది. అంటే పొరపాటున అవసరాల శ్రీనివాస్ ఏదైనా తప్పు చేశాడనుకోండి దానికి శిక్ష శిరీష్ భరించాల్సి ఉంటుంది. అయితే.. ఇదంతా నిజ జీవితంలో అనుకొనేరు, రీల్ లైఫ్ లోనండి బాబు. అల్లు శిరీష్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఒక్క క్షణం” సినిమా కాన్సెప్ట్ ఇది. వినడానికే విడ్డూరంగా ఉన్న ఈ కాన్సెప్ట్ వెండితెరపై చూస్తే ఇంకా అదిరిపోతుందని వినికిడి.
నిజానికి ఈ కాన్సెప్ట్ ను వి.ఐ.ఆనంద్ ముందు నిఖిల్ కి చెప్పాడట, నిఖిల్ కి అంతగా నచ్చకపోవడంతో “ఎక్కడికి పోతావు చిన్నవాడా” కథ ఒకే చేయించుకొన్నాడు. కానీ.. హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అల్లు శిరీష్ మాత్రం రొటీన్ ఎంటర్ టైనర్స్ కంటే డిఫరెంట్ ఫిలిమ్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకోవడం సబబు అని భావించి ఈ సబ్జెక్ట్ ను ఎన్నుకొన్నాడు. మరి నిఖిల్ కాదన్న స్క్రిప్ట్ శిరీష్ కి ఏమేరకు ఉపయోగపడుతుందో చూద్దాం.