Nikhil: 18 పేజస్ కథ ఏంటి అనేది తెలియదు కానీ ఒప్పుకున్నా.. నిఖిల్ కామెంట్స్ వైరల్!

  • December 27, 2022 / 12:09 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈయన కార్తికేయ 2సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నిఖిల్ కు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చింది. ఇలా ఊహించని విధంగా నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఈ సినిమా మంచి లాభాలను అందుకోవడంతో అదే అంచనాలతో డిసెంబర్ 23వ తేదీ 18 పేజస్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి అద్భుతమైన ఫలితాలను అందుకుంది.ఇక ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో చిత్ర బృందం కార్యక్రమాన్ని కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక 18 పేజస్ సినిమా మంచి హిట్ అందుకున్నప్పటికీ నిఖిల్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఈయన అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

అయితే చాలామంది నెటిజన్స్ 18 పేజెస్ సినిమా కన్నా కార్తికేయ 2 గురించి ప్రశ్నలు అడగడం గమనార్హం. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ కార్తికేయ2ఇంత విజయం అవుతుందని ఊహించారా అని అడగడంతో ఎవరు కూడా ఈ విజయాన్ని ఊహించలేదు మనం కష్టపడటం వరకే మన పని ఫలితం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని చెప్పుకొచ్చారు. మరొక నెటిజన్ 18 పేజస్ సినిమా కథ ఏంటి ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ అసలు ఈ కథ ఏంటి అనే విషయం కూడా నాకు తెలియదు నేను కేవలం గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ కాబట్టి సినిమాకు సైన్ చేశాను.ఈ ఒక్క కారణంతోనే ఈ సినిమాకి ఒప్పుకున్నానని అయితే ఈ సినిమాని ఎంపిక చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉందని ఈ సందర్భంగా నిఖిల్ చెప్పుకొచ్చారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus