టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన నిఖిల్ కు (Nikhil) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ప్రస్తుతం నిఖిల్ స్వయంభూ (Swayambhu) అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి, ఇతర విషయాల గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నిఖిల్ మాట్లాడుతూ మా అబ్బాయి పేరు ధీర సిద్దార్థ్ అని అన్నారు.
వాడు పుట్టినరోజు నుంచి నేను నా సమయాన్ని తన కోసమే కేటాయిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. వాడు ఎంతో త్వరగా పెరుగుతున్నట్టు అనిపిస్తోందని ఆయన కామెంట్లు చేశారు. పిల్లవాడి బాధ్యతను పెంచుకోవడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నానని సిద్దార్థ్ వెల్లడించారు. వారానికి ఒక్కసారైనా పార్టీకి వెళ్లడం నాకు అలవాటు అని ఆయన తెలిపారు. ఇప్పుడు పూర్తిగా వెళ్లడం మానేశానని ఆయన చెప్పుకొచ్చారు.
పేరెంట్స్ గా మారిన తర్వాత కొన్ని అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుందని నిఖిల్ పేర్కొన్నారు. పిల్లలను మంచి వాతావరణంలో పెంచాలంటే కొన్ని అలవాట్లను దూరం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పుడు నేను అన్ని రకాలుగా ఆనందంగా ఉన్నానని నిఖిల్ కామెంట్లు చేశారు. నా లైఫ్ ఇలా ఉంటుందని 15 సంవత్సరాల క్రితమే ఎవరైనా చెప్పి ఉంటే నేను ఇంత ఒత్తిడికి గురయ్యేవాడిని కాదని ఆయన అన్నారు.
భరత్ కృష్ణమాచారి (Bharat Krishnamachari) డైరెక్షన్ లో స్వయంభు సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో సంయుక్త మీనన్ (Samyuktha Menon) నటిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నారు. ఈ సినిమా కొరకు నిఖిల్ మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత నిఖిల్ కార్తికేయ3 సినిమాలో నటించనున్నారు. స్వయంభు సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఈ సినిమా అభిమానులు కోరుకుంటున్నారు.