Nithiin wife Shalini: నన్ను బెదిరిస్తున్నాడంటూ నితిన్ భార్య షాలినీ… వైరల్…!

దీపావళి పండుగని పురస్కరించుకుని నిన్న సెలబ్రిటీలంతా బాగా ఎంజాయ్ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేస్తున్న ఫోటోలని, అలాగే ఇష్టమైన వంటకాలను తింటున్న ఫోటోలని, నైట్ క్రాకర్స్ కాలుస్తున్న ఫోటోలని వారి సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో హీరో నితిన్ వైఫ్ షాలినీ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతుంది. ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది షాలినీ. ఈ వీడియోలో నితిన్ తన భార్య షాలినీని ఓ గన్‌తో బెదిరిస్తున్నాడు.

అలా అని ఇది గన్ కాదు. దీపావళి కాబట్టి తన భార్యని సరదాగా రీల్ గన్‌తో ఆటపట్టించాడు నితిన్.అందుకు షాలినీ భయపడుతూ చెవులు మూసుకుంది. ‘దీపావళి సేఫ్ గా జరుపుకోండి… నాకు ఇక్కడ ఎలాగు సేఫ్టీ ఉన్నట్టు అనిపించడం లేదు’ అంటూ ఫన్నీ కామెంట్ పెట్టి.. నితిన్ ని ట్యాగ్ చేసింది. అటు తర్వాత నితిన్ తో కలిసి దిగిన ఫోటోలని కూడా షేర్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది నితిన్ నుండీ ‘చెక్’ ‘రంగ్ దే’ ‘మాస్ట్రో’ వంటి సినిమాలు వచ్చాయి.

ప్రస్తుతం అతను ‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో కలెక్టర్ పాత్రలో నితిన్ కనిపించబోతున్నట్టు సమాచారం. దీంతో పాటు ‘నా పేరు సూర్య’ దర్శకుడు అలాగే స్టార్ రైటర్ అని వక్కంతం వంశీ డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!


రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus