Thammudu OTT: ఇక్కడైనా ‘తమ్ముడు’ మెప్పిస్తాడా..!

నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ‘తమ్ముడు’ అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. జూలై 4న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. సినిమా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయినప్పటికీ తర్వాత నుండి కథ ముందుకు వెళ్ళకపోవడం. దర్శకుడు వేణు శ్రీరామ్ ట్రీట్మెంట్లో కొత్తదనం లేకపోవడం వంటివి ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు.

Thammudu OTT

దీంతో మొదటి షోకే షెడ్డుకి పంపించేశారు ఆడియన్స్. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. నితిన్ ఫామ్లో లేకపోవడం వల్ల ఓపెనింగ్ వీకెండ్ కూడా సరైన వసూళ్లు రాబట్టలేకపోయింది. వీక్ డేస్ లో అయితే చేతులెత్తేసింది. సినిమాలు లేకపోవడం వల్ల ఇప్పటికీ కొన్ని స్క్రీన్స్ లో రన్ అవుతుంది కానీ వసూళ్లు ఏమీ రావడం లేదు.

అన్నీ ఎలా ఉన్నా.. ‘తమ్ముడు’ సినిమాని క్రిటిక్స్, యూట్యూబ్ రివ్యూయర్స్ ఏకి పారేయడం వల్ల.. కొంతమంది ఈ సినిమాపై ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ థియేటర్ కి వెళ్ళలేదు. వాళ్ళు ‘తమ్ముడు’ ఓటీటీకి ఎప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ‘తమ్ముడు’ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఆగస్టు 1 నుండి ‘తమ్ముడు’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందట. అంటే 4 వారాల థియేట్రికల్ రన్ కి నెట్ ఫ్లిక్స్ సంస్థతో దిల్ రాజు ఒప్పందం చేసుకున్నారు అని స్పష్టమవుతుంది. మరి ఓటీటీ ఆడియన్స్ ని అయినా ‘తమ్ముడు’ మెప్పిస్తుందేమో చూడాలి.

పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కియారా అద్వానీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus