షాలినీ అలా అనే అనేసేసరికి షాక్ అయ్యాను : నితిన్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ లో ఒకడైన నితిన్ ఈ ఏడాది పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16 న దుబాయ్ లో తన డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్లాన్ చేసుకున్నాడు. కానీ ఇప్పుడున్న లాక్ డౌన్ పరిస్ధితి వల్ల దానిని హైదరాబాద్ లోనే జరపాలి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకూ పొడిగిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్రకటించడంతో ఇప్పుడు పెళ్లిని పూర్తిగా వాయిదా వేయాలని డిసైడ్ అయ్యారట నితిన్ మరియు అతని కుటుంబ సభ్యులు.

ఈ విషయాన్ని స్వయంగా నితిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని అతనికి కాబోయే భార్య షాలిని కి చెప్తే.. ఆమె రియాక్షన్ కు నితిన్ అండ్ ఫ్యామిలీ షాక్ అయ్యారట. నితిన్ మాట్లాడుతూ…”పెళ్ళి కొన్నాళ్ళు వాయిదా వేస్తె బెటర్ అని నేను షాలినీ కి చెప్పాలని డిసైడ్ అయ్యాను. దీనికి ఆమె ఏమంటుందా అని మొదట నేను టెన్షన్ అయ్యాను. కానీ ఆమె..’పెళ్లంటే జీవితంలో ఒక సారి మాత్రమే చూసుకునేది.

కాబట్టి ఎంతో ఘనంగా చేసుకోవాలి. అంతే కానీ మాస్క్ లు … శానిటైజర్లు పెట్టుకుని భయం.. భయంగా చూసుకునేది కాదు. అంతా సెట్ అయ్యాక ఘనంగా చేసుకుందాం’ అని ఆమె రిప్లై ఇచ్చింది. దీంతో నేను షాక్ అయ్యాను. ఆమె నాకంటే చాలా బాగా ఆలోచించింది అని అనుకున్నాను. ఇక మా రెండు ఫ్యామిలీ మెంబెర్స్ కలిసి పెళ్ళి వాయిదా వేసుకోవాలి అని డిసైడ్ అయ్యాం’ అంటూ నితిన్ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus