‘రంగ్ దే’లో హీరో షాకింగ్ లుక్!

ఈ వారం విడుదల కాబోతున్న చిత్రాల్లో నితిన్ నటించిన ‘రంగ్ దే’ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకి పోటీగా ‘అరణ్య’ లాంటి సినిమా విడుదలవుతున్నప్పటికీ.. యూత్ మొత్తం మాత్రం ‘రంగ్ దే’ వైపే మొగ్గు చూపిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా విడుదలైన సినిమా ట్రైలర్ అంచనాలు పెంచేసింది. వెండితెరపై సరికొత్త రొమాంటిక్ ఎంటర్టైనర్ చూడబోతున్నామనే ఫీలింగ్ ని కలిగించింది.

నితిన్-కీర్తి సురేష్ ల కెమిస్ట్రీ గనుక వర్కవుట్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం. అయితే ఈ సినిమాలో నితిన్ న్యూde గా కనిపించనున్నాడని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నితిన్ కూడా.. ఓ షాట్ లో అలా కనిపిస్తా అంటూ హింట్ ఇచ్చాడు. అయితే అది నిజంగానే న్యూde సీన్ కాదని తెలుస్తోంది. ఓ సన్నివేశంలో కథ ప్రకారం. నితిన్-కీర్తిల మధ్య ఓ ఇంటిమేట్ సీన్ ఉంటుంది. ట్రైలర్ లో కూడా ఆ సీన్ చూపించారు.

ఆ సమయంలో నితిన్ చొక్కా లేకుండా ఒకే ఒక్క షాట్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. దాన్ని న్యూdeసీన్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఏదైతేనేం.. ఈ రూమర్ కూడా సినిమా పబ్లిసిటీకి పనికొస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకుడిగా పని చేశారు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus