Nithya Menen: భీమ్లా ఆఫర్ పై నిత్య షాకింగ్ కామెంట్స్!

సాగర్ కె చంద్ర డైరెక్షన్ లో పవన్, రానా కీలక పాత్రల్లో అయ్యప్పనుమ్ కోషియమ్ కు రీమేక్ గా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమా 2022 సంవత్సరం జనవరి 12వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అల వైకుంఠపురములో సెంటిమెంట్ ను నమ్ముకుని నిర్మాతలు ఈ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారని బోగట్టా. అయితే తాజాగా భీమ్లా నాయక్ సినిమా ఆఫర్ గురించి స్పందిస్తూ నిత్యామీనన్ షాకింగ్ కామెంట్లు చేశారు. నిత్యామీనన్ ఏరికోరి ఈ సినిమాలోకి వచ్చినా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.

అయితే వైరల్ అయిన వార్తల గురించి నిత్యామీనన్ స్పందించి స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. నేను పాత్రల కొరకు ఎవరినీ ఏమీ అడగనని తనకు ఏ పాత్రలు సూట్ అవుతాయో తాను ఏ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని నిత్యామీనన్ తెలిపారు. అలాంటి పాత్రలతోనే దర్శకనిర్మాతలు తన దగ్గరకు వస్తారని నిత్యామీనన్ చెప్పుకొచ్చారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమ్లా నాయక్ సినిమాలోని పాత్ర నేను చేస్తే బాగుంటుందని భావించారని నిత్యామీనన్ అన్నారు.

త్రివిక్రమ్ నన్ను రౌడీలా చూస్తారని అందువల్లే సన్నాఫ్ సత్యమూర్తి మూవీలో కూడా తనకు అలాంటి పాత్రనే ఇచ్చారని నిత్యామీనన్ పేర్కొన్నారు. భీమ్లా నాయక్ లో మంచి పంచ్ డైలాగ్స్ ఉన్న రౌడీ రోల్ లో తాను నటిస్తున్నానని నిత్యామీనన్ అన్నారు. పాత్ర కదిలిస్తే మాత్రమే తాను సినిమాలు చేస్తానని నిత్యామీనన్ తెలిపారు. పవన్ ను అడిగి భీమ్లా నాయక్ సినిమాలో నిత్యామీనన్ నటిస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిత్యామీనన్ ఆ వార్తలకు ఈ విధంగా చెక్ పెట్టారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus