Nithya Menen: ప్రభాస్ గురించి నిత్య మీనన్ చేసిన కామెంట్స్ మళ్లీ వైరల్..!

నిత్య మీనన్.. మదర్ టంగ్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ నటించి విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆకట్టుకునే రూపం, అందమైన కళ్లు, సహజమైన నటనతో పాటు తెలుగు భాష మీద పట్టు సాధించడమేకాక సింగర్‌గానూ మల్టీ టాలెంటెడ్ ప్రూవ్ చేసుకుంది. కెరీర్ స్టార్టింగ్ నుండి గ్లామర్ రోల్స్ జోలికి పోకుండా.. యాక్టింగ్ స్కోప్ ఉండే తనకు నచ్చిన క్యారెక్టర్లే చేస్తూ వస్తోంది.. తను ఎంత టాలెంటెడ్ యాక్ట్రెస్ అయినప్పటికీ బిహేవియర్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది అనే కామెంట్స్ వినిపించేవి..

అయితే తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని.. ముఖ్యంగా హీరో ప్రభాస్ ఇష్యూ తనను ఎంతగానో బాధపెట్టినట్టు అప్పట్లో ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది. ఆ సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిత్య మీనన్ విషయంలో బాగా సీరియస్ అయ్యారు. కొద్దికాలం క్రితం నిత్య మీనన్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్ అన్నట్టు జరిగిన ఆ సంఘటనకు సంబంధించి వీడియో మళ్లీ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు నిత్య వెర్షన్ ఏంటంటే.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తెలుగు లాంగ్వేజ్ సరిగా వచ్చేది కాదు.. సాధారణంగా నేను సినిమాలు ఎక్కువ చూడను..

కన్నడ, మలయాళ సినిమాలు కూడా తక్కువే చూసేదాన్ని.. నాకు తెలుగు రాదు కనుక తెలుగు సినిమాలు అసలు చూసేదాన్ని కాదు.. అప్పట్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్.. వీళ్లే నాకు తెలిసిన టాలీవుడ్ హీరోలు. తెలుగులోకి ఇచ్చిన తర్వాత ఓ సందర్భంలో.. నన్ను మీకు ప్రభాస్ తెలుసా అని అడిగారు.. వాస్తవంగా నాకు ప్రభాస్ పెద్దగా తెలియదు. దాంతో ఎవరు? తెలియదు.. అన్నాను.. అప్పుడు నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నేనేదో పెద్ద తప్పు చేసినట్లు న్యూస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఆ విషయాన్ని పెద్దది చేశారు.

అన్నీ తెలిసి కూడా నా గురించి అలా రాయడంతో చాలా హర్ట్ అయ్యాను.. ఆ న్యూస్ వల్ల నాకు ఇండస్ట్రీలో పెద్ద తగిలింది. ఆ టైంలో ప్రభాస్ ఫ్యాన్స్ నన్ను బాగా ట్రోల్ చేశారు.. ఆ విషయం తల్చుకొని ఇప్పటికీ బాధపడుతుంటాను’ అని చెప్పుకొచ్చింది నిత్య మీనన్. అప్పట్లో సెన్సేషన్ అయిన ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్, నిత్య కొరియర్‌లో చెప్పు పంపించారు అనే న్యూస్ కూడా అప్పుడు బాగానే స్ప్రెడ్ అయ్యింది..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus