నివేదా గ్యాప్ తీసుకొని మరీ ఒకే చేసిన సినిమా ఇదే.!

“జైలవకుశ” తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకొని చదువు మీద దృష్టిసారించిన నివేదా థామస్ (Nivetha Thomas) మళ్ళీ సినిమాలపై దృష్టి మరల్చినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ నాగశౌర్య సరసన “నర్తనశాల” చిత్రంలో నటించేందుకు సమ్మతించి సైన్ చేసిన నివేదా తాజాగా నారా రోహిత్ తో కూడా జోడీ కట్టేందుకు సిద్ధమైందని తెలుస్తోంది. నారా రోహిత్ హీరోగా పి.బి,మంజునాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “శబ్ధం” చిత్రంలో నారా రోహిత్ మూగవాడిగా నటించనుండగా.. అతడి ప్రేయసిగా నివేదా కనిపించనుంది.

కష్టపడి 10 కేజీల బరువు తగ్గిన నారా రోహిత్ ఇకపై కమర్షియల్ సినిమాలు కాకుండా కాన్సెప్ట్ మూవీస్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సెకండ్ ఫేస్ ను నీట్ గా ప్లాన్ చేసుకొంటున్నాడు.
ఇక నారా రోహిత్ మూగవాడిగా నటిస్తుండడం అతడి సరసన కథానాయికగా నివేదా నటిస్తుండడంతో “శబ్ధం” మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది. కమర్షియల్ అంశాలకంటే ఎక్కువగా సినిమాటిక్ వేల్యూస్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ నుంచి నివేదా షూటింగ్ లో పాల్గొంటుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus