సినిమాలకు సైన్ చేయకపోవడానికి కారణం చెప్పిన నివేదా .!

నేచురల్ స్టార్ నాని “జెంటిల్‌మేన్” సినిమాతో నివేతా థామస్ తెలుగు వారికి పరిచయమంది.  తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. నాని తో సమానంగా నటించి లేడీ కమల్ హాసన్ అనే బిరుదుకూడా అందుకుంది.  అలాగే నానితో నిన్నుకోరి మూవీ చేసి హిట్ అందుకుంది. హిట్ పెయిర్ గా పేరుతెచ్చుకుంది.తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ చిత్రం విజయం తర్వాత ఆమెకు అనేక అవకాశాలు తలుపుతట్టాయి. అయినా దేనికి ఓకే చెప్పలేదు. ఇదివరకే ఒప్పుకున్న జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ సినిమాని కంప్లీట్ చేసి మీడియాకి అందుబాటులేకుండా పోయింది.

ప్రతిభగల నటి ఎందుకు సినిమాలకు దూరమయ్యారు?  అనే ప్రశ్న అందరిని తొలిచివేసింది. అభిమానులు నివేదాకి ఏమైంది? అని కంగారు పడ్డారు. దీనిపై నేడు నివేదా ట్విటర్‌ ద్వారా స్పందించింది. “నా తర్వాతి సినిమా ఏంటని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న నా అభిమానులందరికీ.. ఈ విషయం త్వరలో ప్రకటిస్తాను. ‘జైలవకుశ’ తర్వాత నేను నా డిగ్రీ ఆఖరి సెమిస్టర్‌ పరీక్షల కోసం విరామం తీసుకున్నా. మధ్యలో కొన్ని స్క్రిప్టులు చదివాను. కథలు విన్నాను. త్వరలో ఓ కొత్త చిత్రంతో మీ ముందుకు రాబోతున్నాను. ప్రేమతో మీ నివేదా” అని ట్వీట్‌ చేసింది. సుదీర్ వర్మ, శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో నివేదా హీరోయిన్ గా నటించే అవకాశాలున్నాయని టాలీవుడ్ సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus