‘జెంటిల్ మేన్’ ‘నిన్నుకోరి’ ‘జై లవకుశ’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యింది నివేధా థామస్. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ‘118’ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించడానికి సిద్దమయ్యింది నివేధా. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్… ఈ చిత్రం ద్వారా డైరెక్టరుగా పరిచయమవుతున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో.. నివేధా థామస్… 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తుందట. ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది నివేధా థామస్.
ఈ విషయం పై నివేధా థామస్ మాట్లాడుతూ… “ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటనేది.. నేను ఇప్పుడు చెప్పను కానీ.. ఈ సినిమాలో నేను పూర్తిస్థాయిలో కనిపించేది చివరి 20 నిమిషాలు మాత్రమే. ఆ 20 నిమిషాల్లోనే కథ మొత్తం ఉంటుంది. ఈ సినిమాలో నా పాత్ర నిడివి ఎంత అనేది నేను పట్టించుకోలేదు, గుహన్ గారు నాకు కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేరేషన్ లోనే యాక్సెప్ట్ చేసాను. ఈ కథ గుహన్ గారు నిజజీవితంలో ఫేస్ చేసిన ఓ సంఘటన ఆధారంగా రాసుకున్నారు. అందుకే సినిమా డీలింగ్ చాలా కొత్తగా ఉంటుంది. నాకు రియల్ లైఫ్ లో అలాంటి ఎక్స్ పీరియన్స్ అయితే లేదు. తారక్ నా పాత్రను మెచ్చుకోవడం, నా నటనను పొగడడం అనేది చాలా ఎగ్జైటెడ్ గా ఫీల్ అయ్యేను.
నేను సినిమాలు చేయడం అనేది తగ్గించడానికి కారణం నా చదువు. నా థీసిస్ ఫినిష్ చేయడం కోసమే సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. ఆ బ్రేక్ తర్వాత విన్న మొదటి కథ “118”.. విన్న 15 రోజుల్లోనే షూటింగ్ మొదలెట్టాను. నేను ఇప్పుడు గ్రాడ్యుయేట్ ని.. ఇకనుంచి నా ధ్యాస మొత్తం సినిమాల మీదే.ఎన్ఠీఆర్ తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ తో నటించడం భలే డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్. ఇద్దరూ మంచి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చారు. వాళ్ళు అమ్మాయిలకు ఇచ్చే మర్యాద చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను నా క్యారెక్టర్ కి సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాను.
ఒక సినిమాలో నా పాత్ర పరిధి మేరకు మాత్రమే నేను ఇన్వాల్వ్ అవుతాను. కళ్యాణ్ రామ్ గారు, డైరెక్టర్ గారు ఎప్పుడూ కూడా మా సజెషన్స్ తీసుకొనేవారు. ప్రస్తుతం తెలుగులో “బ్రోచేవారెవరురా” సినిమా చేస్తున్నాను. ఈ సినిమాలో ఫస్ట్ టైం కామెడీ ట్రై చేస్తున్నాను. నేను కామెడీ చేస్తున్నానా అని నేనే ఆశ్చర్యపోయాను. అలాగే తమిళం, మలయాళంలోను కథలు వింటున్నాను. ఇక తోటి హీరోయిన్లతో పోటీ అనేది నేను నమ్మను, పట్టించుకోను కూడా. ఒక నటిగా ప్రతి సినిమాతోను నేను ఎదగాలి. స్టార్ డమ్ అనేది నాకు అవసరం లేదు” అంటూ నివేధా థామస్ చెప్పుకొచ్చింది.