Kalyanam Kamaneeyam: ఈ చిన్న సినిమా పోటీని తట్టుకోగలదా..?

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలను స్టార్స్ సపోర్ట్ చేస్తూ.. తమవంతు సాయం అందిస్తున్నారు. ఇలా చేయడం వలన సినిమా జనాల్లోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అందుకే చిన్న హీరోలు తమ సినిమాకి స్టార్స్ సపోర్ట్ ఉండాలని కోరుకుంటారు. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అంటే.. చిన్న సినిమాలకు కచ్చితంగా పెద్ద స్టార్ హీరో సపోర్ట్ ఉండాల్సిందే. ఈ సంక్రాంతికి పెద్ద హీరోలతో పోటీగా ఒక చిన్న సినిమా రాబోతుంది. అదే ‘కళ్యాణం కమనీయం’. ఇందులో సంతోష్ శోభన్ హీరోగా నటించగా..

యూవీ క్రియేషన్స్ సంస్థ సినిమాను నిర్మించింది. ఈ సినిమాను ప్రభాస్ ప్రమోట్ చేశారు. ప్రభాస్ కి ‘వర్షం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు శోభన్ కుమారుడే సంతోష్ శోభన్. అందుకే సంతోష్ కి ఎప్పుడూ సపోర్ట్ గా నిలిస్తుంటారు ప్రభాస్. పైగా యూవీ నిర్మించిన సినిమా కావడంతో ప్రభాస్ సపోర్ట్ ఈ చిన్న సినిమాపై గట్టిగా ఉంటుందని అందరూ అనుకున్నారు.కానీ ప్రభాస్ తో ‘కళ్యాణం కమనీయం’ టీమ్ కేవలం సాంగ్ మాత్రమే లాంచ్ చేయించుకుంది.

అది కూడా డిజిటల్ రిలీజ్ మాత్రమే. ఇలా కాకుండా ప్రభాస్ తో ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తే బాగుండేది. ఇదివరకు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి సినిమా కోసం ప్రభాస్ తో ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తే అది బాగా క్లిక్ అయింది. ఆ స్టైల్ లో సంతోష్ శోభన్ ని ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తే క్రేజీ బజ్ వచ్చేది. కనీసం ప్రభాస్ ని గెస్ట్ గా పిలిచి ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా..

ప్లాన్ చేసుంటే బాగుండేది. రీసెంట్ గా అనుష్కతో ట్రైలర్ లాంచ్ చేయించి ఇప్పుడు ప్రభాస్ తో ఒక సాంగ్ లాంచ్ చేయించారు. యూవీ క్రియేషన్స్ అనుకుంటే ప్రభాస్ తో ప్రమోషన్స్ బాగానే ప్లాన్ చేసుకోవచ్చు కానీ ఎందుకో లైట్ తీసుకున్నారు. రెండు పెద్ద సినిమాల మధ్య తమ సినిమాకి ఎంతోకొంత కలెక్షన్స్ వస్తే చాలని అనుకుంటున్నారేమో!

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus