పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ యాక్టివ్ గా పాల్గొనున్నారు. రాజకీయాల్లో బిజీ అయ్యేలోపు వీలైనన్ని సినిమాలు పూర్తి చేయాలనుకుంటున్నారు పవన్. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పూర్తి స్థాయి పార్టీ కార్యకలాపాలతో పాటు ప్రచార కార్యక్రమాలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. దానికి చాలా డబ్బు అవసరమవుతుంది. ఫండ్స్, పొత్తులు ఇలాంటి వ్యవహారాలు తరువాత తేలుతాయి కానీ ముందు అయితే జనసేనకి కావాల్సిన ఆర్థిక బలాన్ని సమకూర్చుకోవాలి.
అందుకే పవన్ కళ్యాణ్ వరుస షూటింగ్స్ కి ఓకే చెబుతున్నారు. గతేడాది నుంచే వార్తల్లో ఉన్న ‘వినోదయ సితం’ రీమేక్ ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లనుంది. జనవరి 27 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. ఒరిజినల్ వెర్షన్ లో తంబి రామయ్య చేసిన పాత్రను సాయి ధరమ్ తేజ్ ఇమేజ్, వయసుకి తగ్గట్లుగా మార్పులు చేశారు. ఈ రీమేక్ కి సంబంధించిన స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ ఇప్పటికే సిద్ధం చేశారు.
‘భీమ్లానాయక్’ సినిమా మాదిరి ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ రచనా సహకారం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రకారం ఓపెనింగ్ రోజే వస్తుందట. ఒరిజినల్ వెర్షన్ ని డైరెక్ట్ చేసిన సముద్రఖని రీమేక్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. తమిళంలో సముద్రఖని నటించిన పాత్రలోనే పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. మరోపక్క ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ దశలో ఉంది. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.
దీంతో పాటు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కూడా ఒప్పుకున్నారు పవన్. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ ని దర్శకుడు హరీష్ శంకర్ ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు. ‘వినోదయ సితం’ సినిమాకి కేవలం ఇరవై రోజుల వర్కింగ్ డేస్ సరిపోవడంతో దాని ప్రకారమే ప్లాన్ చేసుకుంటున్నారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?