హీరో పేరు సినిమా పేరు అవుతున్న రోజులివి. అవును సినిమాకు పేరు పెట్టాలంటే పెద్దగా కష్టపడకుండా ఆ సినిమాలో హీరో పేరేంటో అదే పెట్టేస్తున్నారు. లేదంటే ఆ హీరోను ఊళ్లో ఏమని పిలుస్తారో అ పేరే సినిమా పేరు అయిపోతుంటుంది. అలాంటిది ఓ సినిమా మొత్తంలో హీరోకు అసలు పేరు లేకుండా ఉంటే అవుతుందా? కానీ ఓ సినిమాలో అలా జరిగింది. అది కూడా చిరంజీవి సినిమానే. అవును చిరంజీవి సినిమాల్లో మంచి విజయం అందుకున్న ఆ సినిమా గురించి చూద్దమా?
చిరంజీవి నటించిన మొత్తం సినిమాలు చూడకపోయినా… ఆయన కెరీర్‌లో బెస్ట్ అనిపించుకున్న సినిమాలు మాత్రం చూసే ఉంటారు. వాటిలో ఓ సినిమానే ‘రాక్షసుడు’. ఏంటీ ఆ సినిమాలో చిరంజీవికి పేరుండదా అంటే అవుననే చెప్పాలి. మరి సినిమా మొత్తం ఎలా పిలుస్తారు? అనే అనుమానం వచ్చిందా. కావాలంటే ఓ ఆరి సినిమా చూసేయండి. లేదంటే ఇంకా చదవండి మీకే అర్థమవుతుంది. సినిమాలో కీలక పాత్రలు రాధ, నాగబాబు చిరంజీవిని సినిమాలో కొన్ని సీన్లలో పిలుస్తారు కానీ… పేరుతో కాదు.
నాగబాబు అయితే ఆయన సీన్స్‌లో ‘ఫ్రెండ్’ అని చిరంజీవిని పిలుస్తుంటాడు. ఇక హీరోయిన్ రాధ అయితే ‘పురుషా’ అంటూ ఉంటుంది. దీంతో సినిమాలో ఎక్కడా చిరంజీవి పేరు అవసరం పడలేదు. అదన్నమాట సంగతి. ఇక ఈ సినిమా సంగతి చూస్తే… యండమూరి వీరేంద్రనాథ్ రచించిన నవల ఆధారంగా రూపొందింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కె.ఎస్.రామారావు ఈ సినిమా రూపొందించారు. ఆ రోజుల్లో ఈ సినిమా 28 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకుంది.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?