Liger Movie: ‘లైగర్’ విషయంలో పూరి ఒత్తిడికి లొంగిపోయారా!

  • July 19, 2022 / 02:15 PM IST

స్ట్రెయిట్‌గా పాయింట్‌లోకి వచ్చేద్దాం.. బాస్‌! విజయ్‌ దేవరకొండ – పూరి జగన్నాథ్‌ సినిమా ‘లైగర్‌’కి మ్యూజిక్‌ డైరక్టర్‌ ఎవరు? ఏంటీ.. వికీపీడియా పేజీ చూసి అందులో పేర్లు చూసి చెప్పేద్దాం అనుకుంటున్నారా? అలా కాకపోతే ఆగండాగండి సినిమా పోస్టర్‌ల మీద చూసి చెప్పేద్దాం అనుకుంటున్నారా? మొదటి రకం పని చేస్తే ఓ ఐదారు పేర్లు కనిపిస్తాయి, రెండో స్టైల్‌లో చూస్తే ఒక్క పేరు కూడా కనిపించదు. పోనీ యూట్యూబ్‌లో టీజర్ కిందో, పాటల వీడియో కిందనో డిస్‌క్రిప్షన్‌లో చూద్దామంటే అక్కడ సరైన సమాధానం ఉండదు. క్లుప్తంగా ఇదీ ‘లైగర్‌’ పరిస్థితి.

సినిమా విడుదలకు ముందు ఆ సినిమా సంగీత దర్శకుడు ఎవరు అనేది చెప్పడానికి, ఆయనకు గౌరవం ఇవ్వడానికి ఆడియో ఫంక్షన్‌ నిర్వహించేవారు. క్యాసెట్‌లు, సీడీలు పోయినతర్వాత దానికి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి మార్చేశారు అనుకోండి. అంతలా మ్యూజిక్ డైరక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఉండేది. అయితే ‘లైగర్‌’ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాల్లో ఎక్కడా మ్యూజిక్‌ డైరక్టర్‌ పేరు కనిపించడం లేదు. చాలా రోజుల క్రితం అయితే ఈ సినిమా మణిశర్మ సంగీత దర్శకుడు అని చెప్పారు. ఆ తర్వాత ఎక్కడా ఆ పేరు వినిపించలేదు.

ఆ తర్వాత బాలీవుడ్‌ మీడియా ప్రకారం చాలా పేర్లు వినిపించి.. అవన్నీ వికీపీడియాలోని ‘లైగర్‌’ పేజీలోకి వచ్చి చేరాయి. రీసెంట్‌గా ‘అకిడి పకిడి’ పాట వచ్చాక లిజో జార్జ్‌, చేతన్‌ అనే కొత్త పేర్లు రెండు సంగీత దర్శకుల జాబితాలో చేరాయి. ఆ పాట డిస్‌క్రిప్షన్‌లో ఈ పేర్లు కనిపించాయి. దీంతో అసలు ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరక్టర్‌ ఎవరు అనే మాట గట్టిగా వినిపిస్తోంది. పీఆర్‌ టీమ్‌ నుండి వస్తున్న టెక్నీషియన్ల లిస్ట్‌లో కూడా మ్యూజిక్‌ డైరక్టర్‌ అనే క్రాఫ్టే లేదు.

‘లైగర్’ సినిమాకు కి సంబంధించి పూరి ఎక్కువగా బాలీవుడ్ మీదే ఎక్కువ డిపెండ్ అవుతున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. కరణ్ జోహార్ మెయిన్ నిర్మాత కావడంతో ఆయన నిర్ణయాల మీదే పూరి నడుస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో సంగీత దర్శకుడు ఎవరు అనే పేరు చెప్పడం లేదట. దానికీ దీనికీ ఏం సంబంధం అంటారా? బాలీవుడ్‌ మ్యూజిక్‌ డైరక్టర్‌ పని చేసి ఉంటే ఘనంగా చెప్పి ఉండేవారు అనే మాట వినిపిస్తోంది. దీంతో ఈ సినిమా ఎవరు సంగీతం వాయించారో తెలియడం లేదు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus