ఈ మధ్య కాలంలో కొన్ని మలయాళం సినిమాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాకపోయినా ట్రూ పాన్ ఇండియా మూవీస్ అనిపించుకుంటున్నాయి. పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్ తో అన్ని భాషల్లో సినిమా తీయడం కాదు.ఒక్క భాషలో తీసినా.. అందరినీ ఆకర్షించే విధంగా ఆ సినిమా కంటెంట్ ఉంటే.. అదే ట్రూ పాన్ ఇండియా సినిమా అని (Nani) నాని, (Gopichand) గోపీచంద్, (Mahesh Babu) మహేష్ బాబు..లు చాలా సార్లు చెప్పారు.
అది కొన్ని మలయాళం సినిమాలు నిజమని ప్రూవ్ చేస్తున్నాయి. ఈ మధ్యనే (Premalu) ‘ప్రేమలు’ అనే సినిమా వచ్చింది. సూపర్ సక్సెస్ అయ్యింది. అంతకు ముందు ‘భ్రమయుగం’ వచ్చింది. అదీ బ్లాక్ బస్టరే..! తాజాగా.. ‘మంజుమ్మెల్ బాయ్స్’ అనే సినిమా వచ్చింది. పెద్దగా చప్పుడు చేయకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల పైనే వసూళ్లు సాధించింది. మలయాళం ఇండస్ట్రీ హిట్ సినిమాల రికార్డులను బ్రేక్ చేసే విధంగా దూసుకుపోతుంది.
కానీ ఈ సినిమాకి ఇంకా ఓటీటీ బిజినెస్ అవ్వకపోవడం షాకిచ్చే అంశం. థియేటర్లలో సక్సెస్ అయిన సినిమాల డిజిటల్ రైట్స్ ను దక్కించుకునేందుకు ఓటీటీ సంస్థలు ఎగబడుతుంటాయి. కానీ ఈ సినిమా విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. పలు ఓటీటీ సంస్థలు చెప్పినదాని ప్రకారం.. ‘మంజుమ్మెల్ బాయ్స్’ ను (Manjummel Boys) థియేటర్లలో చూసేసారు కాబట్టి ఓటీటీల్లో పెద్దగా రీచ్ ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది.
‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!
స్టార్ హీరో అజిత్ హెల్త్ అప్‌డేట్ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?