Telugu OTT: ఎలాంటి ప్రచారం లేకుండా కూడా కొన్ని వస్తున్నాయ్‌!

ఒకప్పుడు సినిమాకు ఒకటే ట్రైలర్‌, ఒకటే రిలీజ్‌ ఉండేది. సినిమా విడుదల అనగా ఓ రెండు నెలల ముందు ప్రచారం మొదలవుతుంది. గ్లింప్స్‌, టీజర్‌కి టీజర్‌, టీజర్, ట్రైలర్‌ లాంటి వీడియోలు రిలీజ్‌ చేసి విడుదల చేస్తారు. తద్వారా ప్రచారం పొందుతారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒక్కో సినిమాకు రెండు రిలీజ్‌లు ఉంటున్నాయి. దీంతో రెండు ట్రైలర్లు వస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం ‘రెండో’ సందడి లేకుండా వచ్చేస్తున్నాయి. దీంతో ఇలా ఎందుకు చేస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది.

కరోనా పరిస్థితులు వచ్చి, తగ్గాక సినిమాలకు రెండు రిలీజ్‌లు వచ్చాయి. థియేటర్‌లో విడుదల చేసినప్పుడు ఓ ట్రైలర్‌ లాంచ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత ఏ రెండు వారాలకో, మూడు వారాలకో లేకపోతే నెలకో ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఇక్కడివరకు ఓకే. ఓటీటీ రిలీజ్‌ కోసం ఏకంగా స్పెషల్‌ ఈవెంట్లు పెట్టి, ప్రచారం చేసి, ఇంటర్వ్యూలు చేసి విడుదల చేస్తున్నారు. ఓకే సినిమాకు ప్రచారం అవసరం కదా అనుకుందాం. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఇలా సెకండ్‌ ప్రచారం లేకుండా వచ్చేస్తున్నాయి. దీంతో ఈ సెకండ్‌ రిలీజ్‌ సందడి అవసరమా అనే మాట వినిపిస్తోంది.

టాలీవుడ్‌లో సెకండ్‌ ప్రచారం సందడి ఏ సినిమాలకు చేశారు అనేది లెక్కేయడం, రాయడం కష్టమే. కాబట్టి ఎలాంటి సందడి లేకుండా వచ్చేస్తున్న సినిమాల గురించి చూస్తే… మిగిలినవన్నీ అలాంటివే. ఈ సెకండ్‌ స్టైల్‌లో వస్తున్న పెద్ద సినిమాలు చూస్తే… ‘మహా సముద్రం’ కనిపిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజ్‌ అవుతుందని తెలిసినా… ఎప్పుడు, ఏంటి అనే వివరాలు లేకుండా సడన్‌గా తెచ్చేశారు. ఇప్పుడు రజనీకాంత్‌ ‘పెద్దన్న’ కూడా అంతే. సన్‌ నెక్స్ట్‌లో రాత్రి చడీచప్పుడు లేకుండా వచ్చేసింది.

ఇలా వచ్చిన సినిమాలను ఎవరూ చూడరా? అంటే చూస్తారు అనే చెప్పాలి. అయితే అన్ని వర్గాల వారికీ ఆ విషయం వెళ్తుందా లేదా అనేది డౌట్‌. దీని కోసమే సెకండ్‌ ప్రచారం చేస్తున్నారు అని ఓ వర్గం వాదన. అయితే థియేటర్‌లో సరైన రెస్పాన్స్‌ రాలేదు. ఓటీటీలో అయినా సరైన స్పందన రావాలి కదా. అందుకే ఈ రెండో ప్రచారం అంటున్నారు కొందరు. ఇందులో ఏది నిజమో తెలియదు కానీ. టాలీవుడ్‌ ప్రమోషన్స్‌లో ఇంకొటి చేరింది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus