ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా రూపొందుతున్నాయి. ఒకేసారి అన్ని భాషల్లోనూ తమ సినిమాని రిలీజ్ చేసుకోవాలని.. అన్ని భాషల్లోని ఫిలిం మేకర్స్ భావిస్తున్నారు. అయితే వేరే రోజుల్లో అయితే పర్వాలేదు కానీ.. పండుగల టైంలో ఇలా చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే.. ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవాలని అన్ని భాషల్లోని ఫిలిం మేకర్స్ భావిస్తారు అనేది గమనించాలి. ఈ ఏడాది సంక్రాంతి టైంలో ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ వంటి బడా చిత్రాలు ఉండగా ‘వారసుడు’ వంటి డబ్బింగ్ సినిమా రిలీజ్ అవుతుంది
అంటే తెలుగు ప్రేక్షకుల నుండి ఎన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పండుగల టైంలో డబ్బింగ్ సినిమాలకి థియేటర్లు అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. కనీసం 3 నెలల ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే కనుక ట్రై చేయొచ్చు. ఈ విషయం తెలీక బాలీవుడ్లో రూపొందిన ఓ పెద్ద సినిమాకి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో పాన్ ఇండియా మూవీగా ‘గణపథ్’ రూపొందింది.
ఈ మధ్యనే అక్టోబరు 20న ఈ సినిమా ప్రేక్షకుల రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. తెలుగులోకి కూడా ఇదే డేట్ కి రిలీజ్ చేయాలని భావించారు. కానీ ‘భగవంత్ కేసరి’ ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి బడా సినిమాలు ఉండటం వల్ల.. అలాగే ‘లియో’ వంటి డబ్బింగ్ సినిమా ఉండటం వల్ల థియేటర్లు దక్కలేదు. ‘లియో’ కూడా డబ్బింగ్ సినిమా అయినప్పటికీ 4 నెలల క్రితమే అక్టోబర్ 19 న రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేశారు.
పైగా ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వంటి పెద్ద బ్యానర్ సపోర్ట్ ఉంది కాబట్టి పర్వాలేదు. కానీ (Ganapath) ‘గణపథ్’ రిలీజ్ డేట్ ఈ మధ్యనే కన్ఫర్మ్ చేశారు.. అందుకే హిందీ వెర్షన్ కి కొన్ని మల్టీప్లెక్సుల్లో షోలు దొరికాయి. కానీ తెలుగు వెర్షన్ కి మాత్రం ఒక్క థియేటర్ కూడా దొరకలేదు. సోమవారం నుండి మాత్రం తెలుగు వెర్షన్ కోసం ఒక థియేటర్ ఇచ్చారని సమాచారం.