‘ఆర్.ఆర్.ఆర్’ టీం రియాక్షన్ ఏంటి?

గత కొద్ది రోజులుగా ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ హీరోయిన్ అలియా భట్ తప్పుకుందంటూ తెగ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ లు హీరోలుగా నటిస్తుండగా.. చరణ్ పక్కన అలియా నటించాల్సి ఉంది. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతుండగా తన మరదలు సీత పాత్రలో ఈమె కనిపించాల్సి ఉంది. అయితే అలియా ఈ పాత్ర చేయడం లేదని.. ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంది అనే వార్తలు ఊపందుకున్నాయి.

No update from RRR movie about Alia Bhatt1

ఇలా వార్తలు రావడానికి కారణం ఇప్పటి వరకూ ఆమె షూటింగ్ లో జాయిన్ అవ్వకపోవడమే. నిజానికి ఆమె గతేడాది ఏప్రిటైంలోనే ల్ టైంలోనే షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉంది. కానీ అప్పుడు చరణ్ జిమ్ లో వర్కౌట్ లు చేస్తూ గాయపడటంతో ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యింది. ఇక ఇటీవల జరుగబోయే ఓ షెడ్యూల్ లో ఆమె జాయిన్ కావాల్సి ఉంది కానీ ఇప్పుడు షూటింగ్ లు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఈసారి కూడా కుదర్లేదు. అయితే చిత్ర యూనిట్ వర్గాల నుండీ అందుతున్న సమాచారం ప్రకారం అలియా ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకోలేదట. రాజమౌళి ఎప్పుడు షూటింగ్ లో పాల్గొనాలి అని చెబితే అప్పుడు సెట్స్ కి రావడానికి ఆమె రెడీగా ఉందట.

Most Recommended Video


నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus