ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న సోనుసూద్ సినిమాలలో విలన్ పాత్రలలో నటించినప్పటికీ నిజజీవితంలో మాత్రం ఈయన హీరో అని నిరూపించుకున్నారు. కరోనా సమయంలో ఈయన ఎంతోమంది ఆపదలో ఉన్న వారిని ఆదుకొని అందరి దృష్టిలో దేవుడిగా నిలిచారు. ఇలా కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవలకు గాను ఈయనకు ఎంతోమంది అభిమానులుగా మారిపోయారు. ఈయన సినిమాలలో విలన్ అయినప్పటికీ నిజజీవితంలో మాత్రం ఎంతో మంచి మనసున్న హీరో అనిపించుకున్నారు.
అయితే ఇలాంటి ఓ గొప్ప వ్యక్తికి నార్త్ రైల్వే అధికారులు వార్నింగ్ ఇచ్చారు.ఇంతకీ రైల్వే అధికారులు తనకు వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఇటీవల రైల్వే ఫుడ్ బోర్డ్ పై కూర్చుని ప్రయాణం చేస్తున్నటువంటి వీడియోని షేర్ చేశారు. అయితే ఈ వీడియో పై స్పందించిన రైల్వే అధికారులు తనకు తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.డియర్ సోనూసూద్ మీరు దేశంలోనే కాదు ప్రపంచంలో మిలియన్ల మంది ప్రజలకు రోల్ మోడల్.
ఇలాంటి మీరు రైల్వే ఫుడ్ బోర్డ్ పై కూర్చుని ప్రయాణం చేయడం సురక్షితమైనది కాదు. ఈ రకమైనటువంటి మీ వీడియో మీ అభిమానులకు తప్పుడు సమాచారాన్ని చేరవేసే ప్రమాదం ఉంది. దయచేసి ఇలా చేయకండి సాఫీగా ప్రయాణం చేసి ఆనందించండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ముంబై రైల్వే కమిషనర్ కూడా ఈ విషయంపై స్పందించి నిజజీవితంలో కూడా ఇలాంటి స్టంట్ చేయొద్దని మీరు ఫుట్ బోర్డు పై ప్రయాణించడం మీ సినిమాలో భాగం కావచ్చు.
కానీ నిజజీవితంలో కాదు అన్ని భద్రత మార్గదర్శకాలను పాటించి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ను అందిద్దాం అంటూ చెప్పుకొచ్చారు. ఇలా సోను సూద్ విషయంలో రైల్వే అధికారులు చేసినటువంటి ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.