నెర్వస్‌ నవంబర్‌.. ఒక్క విజయమూ లేకుండానే ముగిసిపోయిందిగా!

చలికాలంలో వస్తుందనో లేక రైమింగ్‌ కుదిరిందనో కానీ.. నవంబరును కొంతమంది నెర్వస్‌ నవంబరు అని అంటారు. వాళ్లు ఎందుకన్నారో తెలియదు కానీ.. ఈ ఏడాది నవంబరు మాత్రం టాలీవుడ్‌కి నెర్వస్‌ నవంబరే. ఎందుకంటే ఈ మంత్‌ మొత్తంగా చాలా సినిమాలు వచ్చినా సరైన విజయం ఒక్కటీ దక్కలేదు. దీఒంతో నవంబరు టాలీవుడ్‌ని నట్టేట ముంచింది అని అంటున్నారు. సాధారణంగా టాలీవుడ్‌కి నవంబర్ పెద్దగా కలసి రాదు. అయితే ఇలానే కలసి రాని డిసెంబరు ఇటీవల విజయాలు అందిస్తోంది అనుకోండి.

నవంబరు సంగతి చూస్తే.. ఈ నెలలో మొత్తంగా 20కిపైగా సినిమా విడుదలైతే ఒక్కటంటే ఒక్కటీ విజయం సాధించకపోవడం గమనార్హం. 11వ నెలలో మొదటి వారం 10 సినిమాలొచ్చాయి. అందులో ఫలితం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిఖిల్‌ (Nikhil) లాంగ్‌ పెండింగ్‌ సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo) మీద చిన్న ఆశ ఉన్నా.. మరీ అత్యాశ అయిపోతుంది అని ఎవరూ మాట్లాడలేదు. ఆ సినిమా అలానే వచ్చి వెళ్లిపోయింది. హెబ్బా పటేల్ (Hebah Patel) ‘ధూం ధాం’ (Dhoom Dhaam), మంచు లక్ష్మి (Manchu Lakshmi) ‘ఆదిపర్వం’ (Aadiparvam) పరిస్థితి కూడా అంతే.

రెండో వారంలో సినిమాల మీద భారీ హైప్‌ ఉండింది. ఫలితం అంత భారీ భారంగా మారింది. వరుణ్‌తేజ్‌ (Varun Tej) ‘మట్కా’(Matka) , సూర్య  (Suriya) ‘కంగువా’ (Kanguva) ఆ వారంలోనే వచ్చాయి. ఈ రెండు సినిమాల ఫలితాలు డిజాస్టర్లే. మూడోవారం విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)  ‘మెకానిక్ రాకీ’గా (Mechanic Rocky) వచ్చాడు. ఫలితం అంటారా విశ్వక్‌కి కూడా ముందే తెలుసు. మనకు ఇప్పుడు తెలిసింది. ఇక అదే వారంలో అశోక్‌ గల్లా  (Ashok Galla) ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva) వచ్చి వెళ్లిపోయింది. ఇక సత్యదేవ్ (Satya Dev)  ‘జీబ్రా’ (Zebra) కాస్త ఫర్వాలేదు అనిపించింది. చివరి వారంలో ‘రోటీ కపడా రొమాన్స్’ (Roti Kapda Romance)  అలా వచ్చి ఇలా వెళ్లింది.

20 సినిమలకుపైగా వచ్చాయి అన్నారు. అన్ని పేర్లు లేవు అనుకుంటున్నారా? 20లో ముఖ్యమైనవే ఇక్కడ చెప్పాం. అన్నీ చెబితే ఏం లాభం. ఇండస్ట్రీకీ లాభం తీసుకురాని సినిమాలు అవీ. ‘ఈసారైనా’, ‘జాతర’, ‘జువెల్ థీప్‌’, ‘జితేందర్‌రెడ్డి’, ‘రహస్యం ఇదమ్‌ జగత్‌’, ‘ది షార్ట్‌ కట్‌’, ‘వంచన’, ‘సినిమా పిచ్చోడు’, ‘కాలమా ఈ కన్నీళ్లు ఎందుకు’, ‘కనక మహాలక్ష్మి’, ‘కేశవ చంద్ర రమావత్‌’, ‘మందిర’, ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus