సినిమా అయితే తీస్తున్నారు… కానీ జీవిత కథ కాదట

బాలీవుడ్‌లో బయోపిక్స్‌ అంటే ఠక్కున గుర్తొస్తున్న పేరు కంగనా రనౌత్‌. ఇటీవల ఆమె తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరిదశకు వచ్చింది. ఈలోగా కంగన తన తర్వాతి సినిమా పనులు మొదలుపెట్టేసిందట. అంతే కాదు ఇందులో కూడా కంగన్‌ రాజకీయ నాయకురాలిగానే కనిపించబోతుందట. అందులోనూ భారత రాజకీయాలను శాసించిన ఇందిరా గాంధీగా నటించబోతోందట. బాలీవుడ్‌లో మరో బయోపిక్‌కు రంగం సిద్ధమైంది.

భారతదేశ రాజకీయాలను అత్యంత ప్రభావితం చేసి, ఉక్కు మహిళగా పేరు గాంచిన ఇందిరా గాంధీ జీవితంలోని కీలక ఘట్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఇందులో టైటిల్‌ రోల్‌లో బాలీవుడ్‌ లేటెస్ట్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ నటించబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయట. దీనికి సంబంధించి ఇటీవల కంగన రనౌత్‌ స్పందించింది. సినిమా గురించి ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. ‘‘ఇందిరా గాంధీ’ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం. ప్రస్తుతం స్క్రిప్ట్‌ తుది దశ పనులు జరుగుతున్నాయి.

అయితే, ఇది ఇందిరా గాంధీ బయోపిక్‌ కాదు. ఇదొక పీరియాడిక్‌ సినిమా. కేవలం పొలిటికల్‌ డ్రామా మాత్రమే. ఈ సినిమా ద్వారా భారతీయ రాజకీయ స్వరూపాన్ని నేటి తరానికి చూపిస్తాం’’ అని కంగన చెప్పింది. కంగనకు రాజకీయాల ఆపాదన జరుగుతున్న ఈ సమయంలో ఆమె ఇందిరా గాంధీగా నటించబోతుండటం గమనార్హం. మరి ఇందులో ఇందిరా గాంధీ పాత్రను ఎలా చూపిస్తారనేదే ముఖ్యం.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus