ఏపీలో ఎన్నికలు ముగిశాయి. గత 4 నెలలుగా ఎండల్ని లెక్కచేయకుండా తన జనసేన పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) . వాటి ప్రణాళికల కోసం ముందుగా మరో 3 నెలలు కేటాయించి.. మీటింగులు వంటి వాటికి హాజరయ్యాడు. మరోపక్క వీటికోసం తన సినిమాల షూటింగుల్ని సైతం పెండింగ్లో పెట్టేశాడు. ఇప్పుడు పనులు చాలా వరకు పూర్తయినట్టే..! జూన్ 4 వ తేదీకి ఫలితాలు వచ్చేస్తాయి. అవి కూడా చాలా వరకు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయనే టాక్ ఉంది.
సో మొత్తంగా ఇప్పుడు పవన్ కి పెద్దగా పనులు ఏమీ ఉండవు. కాబట్టి.. అర్జెంట్ గా.. తన సినిమాల షూటింగ్ల పై ఫోకస్ పెడితే బెటర్. ముందుగా ‘ఓజీ’ (OG) సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఒక 20 రోజులు కాల్షీట్స్ ఇస్తే.. ఆ సినిమా కంప్లీట్ అయిపోతుంది. మరోపక్క ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ కూడా 40 శాతం కంప్లీట్ అయ్యింది. పవన్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వాలంటే దానికి 35 రోజుల కాల్షీట్స్ ఇవ్వాలట. ఇవి కాకుండా క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ అనే సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చెయ్యాలి.
అది 2 పార్టులుగా రూపొందుతుంది. ఈ ఏడాది చివరికి మొదటి పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే.. అసెంబ్లీకి వెళ్తారు. ఆ ఛాన్సులు ఉన్నాయి. ఇలాంటి టైంలో పవన్ ఈ 3 సినిమాలని 2024 లో కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తారా? అనే అనుమానాలు కూడా ఇంకొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఏదేమైనా పవన్ మాత్రం పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టి నిర్మాతలకి విముక్తి కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే చెప్పాలి.