ఫోటోకి పోజ్ ఇవ్వమంటే పారిపోయాను : ఎన్టీఆర్

నూనూగు మీసాల వయసులోనే ధైర్యంగా.. కాదు కాదు .. బీభత్సంగా నటించారు ఎన్టీఆర్. అతని స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచితే.. అతని ఫోటోలు అభిమానుల సెల్ ఫోన్ స్క్రీన్ సేవర్ గా ఉండాల్సిందే. మరి అటువంటి వ్యక్తి కి ఫోటోలకు పోజులు ఇవ్వడమంటే భయమంటే మీరు నమ్ముతారా? కళ్ళల్లో వెయ్యి ఓట్ల ఎనర్జీ కలిగిన తారక్ తన భార్యకి బయపడుతారు అంటే .. మీరు నమ్మగలరా?.. కానీ ఇవన్నీ నిజం. ఆ విషయాలను స్వయంగా ఎన్టీఆర్ వెల్లడించారు. అతను తాజాగా ‘Celekt’ మొబైల్స్‌కు ప్రచారకర్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్‌ పాల్గొన్నారు.

విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సెల్ఫీలు బాగా దిగుతారా? అనే ప్రశ్నకు బదులిస్తూ సరదా సంగతులు గుర్తుచేసుకున్నారు. “నేను ఫోటోలు దిగను. పోజు ఇవ్వాలంటే వణుకు వచ్చేస్తోంది. ఈ విషయంలో నేను నా భార్యకి బయపడుతుంటాను. మొన్న ఫోటోగ్రాఫర్ ని పిలిపించి ఫోటోలకు పోజు ఇవ్వమని అడిగింది. నేను ఒక్క చోట కుదురుగా కూర్చోలేను. నాకు పోజులు ఇవ్వడమే రాదు. పోజు ఎలా పెట్టాలి పోజు అంటూ కన్ఫ్యూజ్ అవుతుంటాను.  తనకేమో ఫొటోలు తీసి ఆల్బమ్‌లో పెట్టాలని ఉంటుంది. ఇటీవలే మెటర్నటీ ఫొటోషూట్‌ జరిగింది. బలవంతంగా మూడు ఫొటోలు దిగి పారిపోయా” అని ఎన్టీఆర్ వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus