భర్తకు డైవర్స్.. క్యాన్సర్ పై విక్టరి.. ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ..!

టాలీవుడ్లో సింగర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన మమతా మోహన్ దాస్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘ఆకలేస్తే అన్నం పెడతా’ ‘రాఖి రాఖి’ ’36-24-36′ వంటి సూపర్ హిట్ సాంగ్స్ తో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే సంగీత ప్రియుల్ని అలరించే వాయిస్ తో పాటు.. యూత్ ను ఆకట్టుకునే గ్లామర్ కూడా ఈమెలో ఉందని భావించి.. దర్శకధీరుడు రాజమౌళి తన ‘యమదొంగ’ చిత్రంలో ఛాన్స్ ఇచ్చాడు. ఆ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో పాటు వరుస అవకాశాలు ఈమెను వెతుక్కుంటూ వచ్చాయి.

అటు తరువాత ‘హోమం’ ‘విక్టరీ’ ‘కృష్ణార్జున’ ‘చింతకాయల రవి’ ‘కింగ్’ ‘కేడి’ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే తరువాత ఎవ్వరూ ఊహించని విధంగా క్యాన్సర్ బారిన పడింది మమతా మోహన్ దాస్.కొన్నాళ్ళు విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని క్యాన్సర్ ను జయించింది. ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటూనే.. వివాహం కూడా చేసుకుంది. కానీ ఆ మ్యారేజ్ సక్సెస్ కాలేదు. పెళ్ళైన ఏడాదికే భర్తతో విడిపోయింది. కొన్నాళ్ల తరువాత మలయాళం, కన్నడ సినిమాల్లో నటించింది.

త్వరలోనే తెలుగులో కూడా రీఎంట్రీ ఇవ్వబోతుందనేది తాజా సమాచారం. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ను తెలుగులో పవన్ కళ్యాణ్ తో రీమేక్ చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం మమతా మోహన్ దాస్ ని సంప్రదిస్తున్నారట. ఈ ప్రచారం నిజమే అయితే.. మమతాకు ఇది మంచి అవకాశమనే చెప్పాలి.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus