సెలెక్ట్ మొబైల్స్ నుంచి ఎన్టీఆర్ బాగానే అందుకున్నారు!

వరుసగా నాలుగు విజయాలతో ఎన్టీఆర్ క్రేజీ హీరో అయిపోయారు. అందుకే స్టార్ డైరక్టర్స్ అతనితో తీయాలని అనుకోవడమే కాదు పలు వాణిజ్య సంస్థలు కూడా ఎన్టీఆర్ సైన్ కోసం ఎదురుచూస్తున్నాయి.  గతంలో మలబార్ గోల్డ్, నవరత్న ఆయిల్ వంటి బ్రాండ్స్‌కు ఎన్టీఆర్ ప్రచారకర్తగా వ్యవహరించారు. అవి సక్సస్ బాటలో నడిచాయి. అందుకే మొబైల్ రిటెైల్ చైన్ “సెలెక్ట్” సంస్థ కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్ ని సెలక్ట్ చేసుకుంది. భారీ రెమ్యునరేషన్ కూడా అఫర్ చేసింది. అందుకే ఈ కంపెనీని తారక్ జనాల్లోకి తీసుకెళ్లారు. తాజాగా తారక్ ఎంత తీసుకున్నారో అనే విషయం బయటికి వచ్చింది.

మలబార్ గోల్డ్, నవరత్న ఆయిల్ బ్రాండ్స్‌కు ప్రచారకర్తగా వ్యవహరించినందుకు కోటి పారితోషికం తీసుకున్న తారక్.. ఇప్పుడు సెలెక్ట్ మొబైల్స్ కోసం కోటి పాతిక లక్షలు అందుకున్నట్టు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఇక తారక్ సినిమా విషయానికి వస్తే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ చిత్రం టీజర్ ఆగస్టు 15న విడుదల కాబోతుంది. దసరా కానుకగా అక్టోబర్ 11న థియేటర్లోకి రానుంది. అనంతరం రాజమౌళి సినిమాని మొదలెట్టనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus