ఎన్టీఆర్ కు పంజాబీ జిరాక్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. చరణ్, ఎన్టీఆర్ కు గాయాలు కావడంతో రెండో షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన క్రేజ్ ఇప్పుడు నార్త్ లో మరింత బలపడింది. విషయం ఏంటంటే.. టిక్ టాక్ లో రక రకాల జనాలు వీడియోలు చేస్తుంటారు. అందులో చాలా మంది తమ అభిమాన హీరోలను ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అయితే అందులో ఓ వ్యక్తి అచ్చం మన ఎన్టీఆర్ లానే దిగిపోయాడు.

అయితే ఆ వ్యక్తి తెలుగు వాడు కాదు.. పంజాబీ. అతని పేరు షమిందర్. ఇతనికి ఎన్టీఆర్ కు పెద్ద ఫ్యాన్. ఇతనికి ఎన్టీఆర్ ను కలవాలని చాలా ఆశగా ఉందట. నటన పట్ల కూడా షమిందర్ కు ఆసక్తి ఉందట. అందుకే ఎన్టీఆర్ డైలాగులు అనుకరిస్తూ కొన్ని టిక్ టాక్ వీడియోస్ చేసి తన సోషల్ మీడియాలో పోస్టు చేసాడు. అయన చూడ్డానికి అచ్చం ఎన్టీఆర్ లానే ఉన్నాడు. మరి ఎన్టీఆర్ ను కలిసే అవకాశం ఈ పంజాబీ ఎన్టీఆర్ కు ఎప్పటికి వస్తుందో చూడాలి. ఇక ఇతని ఫోటోలను ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus