అతి చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు, బుద్ది చెప్పిన మహేష్ ఫ్యాన్స్!

  • August 27, 2018 / 05:58 AM IST

నిన్నమొన్నటివరకూ పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఇతర హీరోల అభిమానులు మాత్రమే కాదు సగటు ప్రేక్షకులు, ప్రజలు కూడా వింతగా చూసేవారు. పవన్ ఫ్యాన్స్ ఏ కారణం లేకుండా పేట్రేగిపోతారని, ఎవర్ని పడితే వాళ్ళని ఎలా పడితే అలా తిడతారని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా చెడ్డ పేరు ఉంది. అయితే.. ఇప్పుడు ఆ చెడ్డ పేరును ఎన్టీయార్ అభిమానులు కూడా పంచుకొంటున్నారు. నిన్నట్నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ మహేష్ బాబును టార్గెట్ చేసి ఇష్టమొచ్చినట్లుగా తిట్టడం మొదలెట్టారు. కేవలం మహేష్ బాబును మాత్రమే కాదు ఆయన సతీమణి నమ్రత, పిల్లలు గౌతమ్, సీతారలను కూడా ఈ రొచ్చులోకి దించి ఇష్టమొచ్చినట్లు వాగడం మొదలెట్టారు. ఇంతకీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ మహేష్ & ఫ్యామిలీ టార్గెట్ చేయడం ఎందుకు మొదలెట్టారా అంటే.. మొన్నామధ్య మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీయార్ “హ్యాపీ బర్త్ డే మహేష్ అన్నా” అని ట్విట్టర్ లో విష్ చేయగా.. మహేష్ బాబు దానికి రిప్లై ఇవ్వలేదు.

దాంతో ఎన్టీయార్ ఫ్యాన్స్ అందరూ “థ్యాంక్స్ ఎందుకు చెప్పలేదు” అని హ్యాష్ ట్యాగ్ తో మహేష్ బాబు ఫ్యామిలీ & ఫ్యాన్స్ ను తిట్టడం మొదలెట్టారు. వాళ్ళు తిడుతూ ఉంటే మహేష్ ఫ్యాన్స్ ఉరుకుంటారా చెప్పండి. వెంటనే వాళ్ళు కూడా కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. గంటలోనే “సిగ్గులేని ఎన్టీయార్ ఫ్యాన్స్” అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం మొదలెట్టారు. ఈ విషయం కాస్త ట్విట్టర్ లో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద మొన్నటివరకూ ఉన్న పాజిటివిటీ మొత్తం పోయి నెగిటివ్ రియాక్షన్ మొదలైంది. మరి ఈ విషయాన్ని ఇప్పటికైనా ఎన్టీయార్ & మహేష్ బాబు సోషల్ మీడియా టీం లేదా పి.ఆర్ టీం కాస్త సీరియస్ గా తీసుకొని తగిన చర్యలు తీసుకోకపోతే.. ఈ పెంట ఇంకా పెద్దదై సదరు హీరోలకు చెడ్డ పేరు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయినా కామెడీ కాకపోతే.. పర్సనల్ గా అన్నయ్య, తమ్ముడు అని పిలుచుకొనే మహేష్ & ఎన్టీఆర్ లు ట్విట్టర్ లో రిప్లై ఇచ్చుకోకపోతే ఇంతలా హడావుడి చేయాలా? ఏంటో వెర్రి అభిమానం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus