మాటీవీ చేస్తున్న పనిని తప్పుబట్టిన తారక్ అభిమానులు!

తెలుగు ఎంటర్ టైన్ ఛానల్ మాటీవీపై తారక్ అభిమానులు మండిపడుతున్నారు. ఛానల్ యాజమాన్యం ధన దాహానికి హద్దులేకుండా పోయిందని విమర్శిస్తున్నారు. మాటీవీ ఆత్మ శాంతించాలని  సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు ఇంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయట పడింది.

ఆ వివరాల్లోకి వెళితే… కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1 న విడుదలై టాలీవుడ్ రికార్డులన్నింటినీ రిపేర్ చేసింది. వేగంగా 50, 100 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ సృష్టించింది. తారక్ కెరీర్ లో అత్యధిక వసూల్ చేసిన చిత్రంగా నిలిచింది. టాలీవుడ్ లో అత్యధిక షేర్ కలెక్ట్ చేసిన టాప్ 3 చిత్రాల్లో స్థానం సంపాదించుకుంది. ఇటువంటి చిత్రం థియేటర్లలో 100 రోజులు కూడా పూర్తి చేసుకోక ముందే బుల్లి తెర లో ప్రసారం చేసేందుకు మాటీవీ సిద్ధమైంది.

ఈ నెల 23 న టెలికాస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. అప్పటికీ గ్యారేజ్ వయసు 53 రోజులు మాత్రమే. ఈ విషయమే తారక్ అభిమానులకు మింగుడు పడడం లేదు. మరికొన్ని రోజులు ఆగి టీవీ లో ప్రసారం చేయాలనీ డిమాండ్ చేస్తూ.. “మా టీవీ” అని రాసిన కర పత్రాలను తగల బెడుతున్నారు. దీనికి ఛానల్ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus