మల్టీ ఫ్లెక్స్ వ్యాపారంలోకి ఎన్టీఆర్!

హీరోలుగా బిజీగా ఉంటూనే రామ్ చరణ్ తేజ్, మహేష్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ తో క‌లిసి మహేష్  మ‌ల్టీప్లెక్స్ వ్యాపారం లోకి దిగారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25 మ‌ల్టీప్లెక్స్ లు నిర్మించేందుకు పనులు మొదలయ్యాయి. ప్రభాస్ కూడా తన సంపాదనతో  నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారి పక్కన ఏడున్నర ఎకరాల స్థలాన్ని ప్రభాస్ కొన్నట్లు తెలిసింది. ఇక్కడ ఎంటర్టెన్మెంట్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

ఇందుకోసం 40 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ స్థలంలో మూడు థియేటర్ల మల్టీ ఫ్లెక్స్ కాంప్లెక్స్,  రెస్టారెంట్లు, చిన్న పిల్లలు ఆడుకునే థీమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు.  వీరి నుంచి స్ఫూర్తి పొందారో, లేదో తెలియదు కానీ…  యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీ ఫ్లెక్స్  బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చిన్న సైజు మల్టీఫ్లెక్స్ థియేటర్లను నిర్మించేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు రూపుదిద్దుకోవడం, థియేటర్లు దొరక్కపోవడం వంటి సమస్యలను గత కొంతకాలంగా పరిశీలించిన తారక్.. ఇది లాభదాయక వ్యాపారమని ఇందులో అడుగుపెట్టబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus