భార్య, అబ్బాయి తో కలిసి విదేశీ టూర్ కి వెళ్లిన ఎన్టీఆర్!

హ్యాట్రిక్ హిట్ తో దూసుకుపోతోన్న ఎన్టీఆర్ జై లవకుశ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. బాబీ దర్శకత్వంలో తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా 125కోట్ల క్లబ్ లో చేరింది. అదే ఉత్సాహం తో  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న మూవీని లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వెళ్ళడానికి చాలా సమయం పట్టేట్టు ఉంది. కారణం త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమానే. ఈ సినిమా నిన్ననే ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. అజ్ఞాతవాసి వచ్చే నెల రిలీజ్ అవుతుంది.

అప్పుడు త్రివిక్రమ్ ఫ్రీ అవుతారు. ఎన్టీఆర్ కథపై కూర్చుంటారు. ఆ స్క్రిప్ట్ కంప్లీట్ కావడానికి మరో నెల సమయం పడుతుంది. సో ఎన్టీఆర్ 28 వ మూవీ మార్చిలోనే సెట్స్ మీదకు వెళుతుంది. అప్పటి వరకు దొరికిన సమయాన్ని ఎన్టీఆర్ ఎంజాయ్ చేయడానికి వినియోగించుకుంటున్నారు. భార్య లక్ష్మి ప్రణతి, కొడుకు అభయ్ రామ్ తో కలిసి యూరప్ టూర్ వెళ్లారు. అక్కడ అందమైన ప్రదేశాల చుట్టూ తిరుగుతున్నారు. తిరిగి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ సినిమాతో పాటు.. రాజమౌళి తో చేయనున్న మల్టీ స్టారర్ సినిమా పనుల్లో బిజీ కానున్నారు. అలాగే బిగ్ బాస్ సీజన్ టు కి సంబంధించిన పనుల్లోనూ నిమగ్నం కానున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus