దేశభక్తుడిగా కనిపించనున్న ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్స్ తో నట విశ్వరూపం చూపించిన జై లవకుశ కలక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమా త్వరలో వంద కోట్ల క్లబ్ లో చేరనుంది. ఈ సినిమాతో పాటు బిగ్ బాస్ షో కోసం పగలు రాత్రి కష్టపడిన ఎన్టీఆర్ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. భార్య లక్ష్మి ప్రణతి, కొడుకు అభయ్ రామ్ తో కలిసి విహారయాత్రకు వెళ్లనున్నారు. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పనుల్లోకి అడుగుపెట్టనున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆ మూవీ విశేషాలు తెలుసుకోవాలని అభిమానులు ఆతృతగా ఉన్నారు.

వారి కోసం అన్నట్టు ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ సినిమాలో తారక్ మిలటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని తెలిసింది. దేశభక్తి నేపథ్యంలో సాగే కథ అయి ఉంటుందని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు అల్లు అర్జున్ దేశభక్తి కథతో సినిమాలను చేస్తారు. వారికి పోటీకి అన్నట్టుగా ఎన్టీఆర్ ఈ కథ ఎంచుకున్నట్లు సమాచారం. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus