ఆ డైరెక్టర్ తో రెండోసారి పనిచేయడానికి రెడీ అవుతున్న ఎన్టీఆర్?

ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో నటిస్తున్నాడు. చరణ్ కూడా మరో హీరో కూడా నటిస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని 2020 జులై 30 న విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు రాజమౌళి అలాగే నిర్మాత డీవి.వి.దానయ్య ఇదివరకే ప్రకటించారు. ఇక ఈ చిత్రం పూర్తయిన తరువాత ఎన్టీఆర్ ఎవరి డైరెక్షన్లో సినిమా చేస్తాడా అని అభిమానుల్లో ఆసక్తిని నెలకొంది. దీనికి సంబంధించి ఓ వార్త ఫిలింనగర్ లో తెగ హల్ చల్ చేస్తుంది.

తనకి ‘అరవింద సమేత’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ డైరెక్షన్లో మరోసారి ఎన్టీఆర్ పనిచేయబోతున్నాడట. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనని కలవడానికి వచ్చిన కొందరు అభిమానులు… ‘రాజమౌళి తరువాత ఏ దర్శకుడితో తదుపరి సినిమా ఉంటుంది? అని అభిమానులు అడిగిన ప్రశ్నకి ఆయన త్రివిక్రమ్’ అని చెప్పాడట. అయితే త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక మెగాస్టార్ చిరంజీవితో కూడా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇవి రెండూ పూర్తయ్యాకే ఎన్టీఆర్ తో సినిమా ఉండే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus