NTR and Ram Charan: టీవీ షోలో జక్కన్న గురించి నిజాలు బయటపెట్టిన తారక్‌ – చరణ్‌!

రాజమౌళిని ముద్దుగా జక్కన్న అని పిలుచుకుంటుంటారు మన సినిమా అభిమానులు. అయితే ఆయనకు ఈ పేరు పెట్టింది ఎన్టీఆర్‌ అనే విషయం తెలిసిందే. సినిమాను బొమ్మ చెక్కినట్లు చెక్కుతాడు కాబట్టి జక్కన్న అయ్యాడు రాజమౌళి. ఈ క్రమంలో జక్కన్న శిష్యులు, కలసి పని చేసినవారు ఒక్కోసారి ఇబ్బంది పడుతుంటారట. అలాంటివారిలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కూడా ఉన్నారు. రాజమౌళితో కలసి పని చేయడం గురించి తారక్‌, చరణ్‌ మాట్లాడుకున్నారు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం దీనికి వేదికైంది. ఈ సందర్భంగా రాజమౌళి పర్‌ఫెక్షనిజం గురించి చెబుతూ… తారక్‌ సరదాగా చాలా మాటలే అనేశాడు. ఇప్పుడా వైరల్‌గా మారాయి.

సీన్స్‌ తెరకెక్కించేటప్పుడు రాజమౌళి పర్‌ఫెక్షన్‌ కోసం చాలా కష్టపడతారని, ఎన్ని టేకులకైనా వెనుకాడడు. అనుకున్నది అనుకున్నట్లు వచ్చేంతవరకు తీస్తూనే ఉంటారని పేరు. అందుకే రాజమౌళిని తారక్‌.. జక్కన్న అని పిలుస్తాడు. ఆ పిలుపు ఆ తర్వాత అందరి పిలుపు అయ్యింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌ సమయంలోనూ రాజమౌళి అలానే ఉన్నాడట. ఒక్కోసారి సీన్‌ బాగా వచ్చేంతవరకు రాజమౌళి ఊరుకునేవాడు కాదట. దాంతో ఎన్టీఆర్‌ ‘జక్కన్న ఇదీ మరి అన్యాయం. దీనిని పిచ్చి అంటారు’ అంటూ సరదాగా విసుక్కునేవాడట. ఈ విషయమే ఎన్టీఆరే చెప్పాడు. ఈ క్రమంలో జక్కన్నని ‘నరకాసురుడు’ అంటూ ముద్దుగా విసుక్కున్నాడు ఎన్టీఆర్‌.

మరోవైపు రామ్‌చరణ్‌ కూడా రాజమౌళితో పని చేయడం గురించి మాట్లాడాడు. ‘నా లాంటి స్లో పర్సన్‌ జక్కన్న లాంటి వ్యక్తే కరెక్ట్‌’ అని అన్నాడు చరణ్‌. రాజమౌళి అలా ఉండటం వల్లే నేను అంతలా నటించగలిగాను. అలాంటి మంచి పాత్రలు మనకు ఇచ్చినందుకు జక్కన్న ఎన్ని థ్యాంక్స్‌ చెప్పినా తక్కువే అని కూడా అన్నాడు. రాజమౌళి అలా ఆలోచించి, పని చేస్తాడు కాబట్టే ‘బాహుబలి’తో భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్త ఖ్యాతి తీసుకొచ్చాడు అని రాజమౌళిని గుర్తు చేసుకున్నారు తారక్‌, చరణ్‌.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus