యంగ్ టైగర్ ఎన్టీఆర్, సహజంగా మీడియాకి మంచి మిత్రుడుగా ఉండే ఎన్టీఆర్, అనుకోకుండా మీడియా పాలిట విలన్ గా మారిపోయాడు…తాను తాజాగా నటించిన జై లవ కుశ మూవీ మంచి సక్సెస్ ను అందుకున్నప్పటికీ, రివ్యూస్ పరంగా కాస్త మిక్స్డ్ రివ్యూస్ రావడంతో సక్సెస్ మీట్ లో రివ్యూ రాసేవాళ్ళని కాస్త ఘాటుగానే హెచ్చరించాడు…అదే క్రమంలో, సినిమాను ఓ పేషంట్ గా అభివర్ణిస్తూ విశ్లేషకులను దారినపోయే దానయ్యలు అంటూ కూడా సంభోదించాడు. ఇక ఈ విషయంపై మీడియా చేస్తున్న రచ్చ చూసిన తరువాత….త్వరలోనే ఓ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి క్రిటిక్స్ ను అన్నందుకు సారీ చెబుతాడని వార్తలు వినిపిస్తున్నాయి…అయితే మరో పక్క అభిప్రాయం చెప్పడంలో వాక్ స్వాతంత్రం అందరికి ఉంటుంది.
అయితే స్టార్ హీరో అంటే మీడియాతో కచ్చితంగా అవసరం ఉంటుంది. సినిమా మీడియా రెండు కలిసి పనిచేయాలి. మీడియా ప్రమోషన్స్ లేనిదే ఎలాంటి సినిమా వర్క్ అవుట్ అవదు. తాను మాట్లాడింది కొందరి గురించే అయినా మీడియా మొత్తం దాన్ని తీసుకుందని భావించి త్వరలోనే ఓ ప్రెస్ మీట్ పెట్టేసి అన్ని విషయాలపై చర్చకు ఆహ్వానం పలుకే ఆలోచనలో ఉన్నాడట తారక్. మొత్తంగా చూసుకుంటే ఎంత స్టార్ అయినా మీడియా విషయంలో కాస్త ఆచి తూచి మాట్లాడాలి అని మరోసారి తారక్ విషయంలో నిజం అయ్యింది. ఏది ఏమైనా…తారక్ కోణంలో చూస్తే తాను కరెక్ట్, మీడియా కోణంలో చూస్తే మీడియా కరెక్ట్, ఎవరి వర్షన్స్ వాళ్ళకి ఉన్నప్పుడు, దీనిపై చర్చించుకుని క్లోస్ చేసుకోవడం అనేది చాలా మంచిది.