మహా నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్రపై సినిమాను తీసేందుకు నందమూరి బాలకృష్ణ పనులు మొదలెట్టారు. ఎన్టీఆర్ బాల్యం, యవ్వనంలో సంగతులు, విశేషాలను పరిశోధించి తెలుసుకున్నారు. మహానుభావుడి కథను తెరకెక్కించడానికి డైరక్టర్ గా రామ్ గోపాల్ వర్మ ను బాలయ్య సెలక్ట్ చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ వస్తుందంటే అభిమానులు సంతోషిస్తున్నారు. మరి ఆయన మనవడు ఏమనుకుంటున్నారు ? అదే విషయాన్నీ ఈరోజు ఎన్టీఆర్ ముందు ఉంచారు. స్టార్ మా ఛానల్ వారు రూపొందిస్తున్న ‘బిగ్‌బాస్’ కార్యక్రమం వివరాలను వెల్లడించాడని ఏర్పాటు చేసిన సమావేశంలోఎన్టీఆర్ బయోపిక్ గురించి తారక్‌ను ప్రశ్నించగా, ఆయన ఇలా స్పందించారు.
‘తాతగారు ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. రామారావు గారు తెలుగు ప్రజల ఆస్తి. తెలుగు ప్రజల సొత్తు. ఆయనపై సినిమా వస్తుందంటే సంతోషమే. ఇంకా బయోపిక్‌లో బాబాయ్ నటిస్తే బ్రహ్మాండమే ’ అని అన్నారు. ప్రస్తుతానికి ఆ చిత్రంలో తాను నటిస్తానో లేదో తెలియదన్నారు. డైరక్టర్ వర్మ ఎలా బయోపిక్ ని తెరకెక్కిస్తారో అనే దానిపై మాట్లాడటానికి ఆయన నిరాకరించారు. సినిమా వచ్చే వరకు వేచి చూద్దామని చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.