తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ అతి చిన్న వయసులోనే హీరోగా వెండి తెరపై కనిపించారు. పదహారేళ్ల కిందట ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు “నిన్ను చూడాలని” చిత్రంతో తారక్ ని హీరోగా పరిచయం చేశారు. వీఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయం సాధించింది. నిర్మాతకు మంచి లాభాలను అందించింది. ఈ చిత్రానికి ఎన్టీఆర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?. అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు. 19 ఏళ్ళ వయసులో అంత మొత్తం చూసి చాలా కంగారు పడ్డారంట. ఆనాడు జరిగిన సంఘటను రీసెంట్ గా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూ లో చెబుతూ.. “నాలుగు లక్షలను నాకు కవర్లో పెట్టి ఇచ్చారు. ఆ కవర్ ని ఎక్కడ దాచి పెట్టాలో నాకు తెలియలేదు. మొదట ఆ కవర్ ను ఇంట్లో ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచాను.
అక్కడ సేఫ్ కాదని బాత్రూమ్ లో పెట్టాను. అలా ఉంచితే ఎవరైనా చూస్తారేమోనని, కారు డాష్ బోర్డులో ఉంచాను. కారు డ్రైవర్ తీసుకునే అవకాశం ఉందని అక్కడ కూడా తీసేశాను” అని వివరించారు. చివరికి తన తొలి రెమ్యునరేషన్ ని తల్లికి బహుమతిగా ఇచ్చేశానని ఎన్టీఆర్ వెల్లడించారు. అప్పుడు మనసుకు హాయిగా అనిపించిందన్నారు. ప్రస్తుతం కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటున్న ఎన్టీఆర్ తన అన్న కోసం ఎటువంటి పారితోషికం తీసుకోకుండా జై లవ కుశ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 1 న రిలీజ్ చేయడానికి దర్శకుడు బాబీ ప్రయత్నిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.