ఎన్టీఆర్ కి పంచ్ లు ఇచ్చిన అభయ్ రామ్!
- August 27, 2018 / 07:42 AM ISTByFilmy Focus
“భార్య అంటే ఇష్టపడి తెచ్చుకున్న బరువు. పిల్లలంటే మోయాలనిపించే బాధ్యత. నాన్నంటే ఒక మర్చిపోలేని జ్ఞాపకం”… ఇలా గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసే ప్రతి మాటలో ఎంతో లోతైన అర్థం ఉంటుంది. అందుకే అతని దర్శకత్వంలో నటించాలని ఎన్టీఆర్ ఆశ పడ్డారు. ఇప్పుడు అతని దర్శకత్వంలోనే “అరవింద సమేత వీర రాఘవ” సినిమా చేస్తున్నారు. త్రివిక్రమ్ మాటల ప్రభావమో.. అతనితో కలిసి జర్నీ చేస్తున్న ఎఫెక్టో తెలియదు కానీ.. షూటింగ్ ముగించి ఇంటికి పోగానే లోకాన్ని మరిచి పోయి తన పిల్లలతో కలిసి ఆడుకుంటున్నారు. చిన్న పిల్లవాడిగా మారిపోయి తన్నులు తింటున్నారు. బయట అతన్ని పేరు పెట్టి పిలవడానికి కూడా అందరూ ఆలోచిస్తారు.
అటువంటిది తన పెద్ద తనయుడితో చెంపలు పగిలిపోయేలా దెబ్బలు తింటున్నారు. పైగా ఆ విషయాన్ని ఆనందంతో అభిమానులకు చెప్పుకుంటున్నారు. అభయ్ కి తనకి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. “నా పెద్ద కుమారుడికి నేను పంచింగ్ బ్యాగ్ అయిన వేళ..’ అని సరదాగా క్యాప్షన్ తో పాటు కరాటే కిడ్ అన్న హ్యాష్‌ట్యాగ్ ను కూడా పెట్టారు. ఈ వీడియో చూసి అభిమానులు ఆనందపడుతున్నారు. తారక్ తన పిల్లల్తో ఆడుకుంటున్నారో చూసి సంతోషపడుతున్నారు. ఎన్టీఆర్ తనయుడి కూడా యాక్షన్ హీరో కావడం ఖాయమని ఇప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు.
A post shared by Filmy Focus (@filmyfocus) on















