‘బిగ్ బాస్ సీజన్ 3’ పై ఎన్టీఆర్… ఫైనల్ డెసిషన్ అదే?

తెలుగులో ‘బిగ్ బాస్’ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకోవడంతో ఇప్పుడు ‘బిగ్ బాస్ సీజన్ 3’ కోసం అందరూఎదురుచూస్తున్నారు. ఇక ఇందులో హోస్ట్ గా ఎవరు చేస్తారనేది పై అందరి దృష్టి పడింది. మొదటి సీజన్ కి జూ.ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా… నాని సీజన్ 2 కి హోస్ట్ గా చేసాడు. ఇప్పుడు సీజన్ 3 కి ఎవరు హోస్ట్ చేస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. సీజన్ 1 ని జూ.ఎన్టీఆర్ బాగానే పూర్తి చేసాడు. సీజన్ 2 కి మాత్రం నాని అంత బాగా చేయలేదనే విమర్శ ఎదుర్కొన్నాడు. దీంతో ‘సీజన్ 3’ కి నానిని అడిగినప్పటికీ నో చెప్పేశాడట. దీంతో వెంకటేష్, నాగార్జున, విజయ్ దేవరకొండ లను కూడా సంప్రదించినప్పటికీ వారు కూడా సారీ చెప్పేశారట.

ఇక చేసేదేమీ లేక మళ్ళీ ‘సీజన్ 1’ కి హోస్ట్ గా చేసిన జూ.ఎన్టీఆర్ నే సంప్రదించారట. మొదట కొన్ని కండిషన్స్ పెట్టి చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించినప్పటికీ… ఇప్పుడు అది కుదిరేలా లేదని ఫిలింనగర్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి అసలు కారణం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం. రాజమౌళి డైరెక్షన్లో చరణ్ – ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం జూలై 30 2020 న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి, నిర్మాత డీ.వి.వి దానయ్య ప్రకటించేసారు. దీంతో షూటిండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ 2020 జనవరికి ఫినిష్ చేసేయ్యాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే నెల నుండీ అహ్మదాబాద్, కోల్ కతా లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఈ కారణంగాఎన్టీఆర్… బిగ్ బాస్ సీజన్ 3 చేయలేనని ‘స్టార్ మా’ వారికీ చెప్పేశాడట. అయితే సీజన్ 3 కి ఏమైనా ఎన్టీఆర్ నే తీసుకోవాలని ‘స్టార్ మా’ భావిస్తోందట. ‘ఆర్.ఆర్.ఆర్’ నార్త్ షెడ్యూల్ 3 నెలలు పడతుందట. దాని తరువాత మళ్ళీ 3,4 నెలలు హైదరాబాద్ లోనే షూటింగ్ జరుగుతుంది. దీంతో ముందుగా ఏప్రిల్ లో ‘బిగ్ బాస్ సీజన్ 3’ స్టార్ట్ చేయాలని ‘స్టార్ మా’ అనుకున్నప్పటికీ ఇప్పుడు ఎన్టీఆర్ కోసం జూన్, లేదా జూలై నెలలో నిర్వహించాడానికి ప్లాన్ చేస్తున్నారట. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus