‘అన్నమయ్య’ తర్వాత వరుస ప్లాపులతో సతమతమయ్యారు నాగార్జున. అలాంటి టైంలో ‘సీతారామరాజు’ (Seetharama Raju) తో హిట్ అందుకుని కం బ్యాక్ ఇచ్చారు. అయితే వెంటనే ‘రావోయి చందమామ’ (Ravoyi Chandamama) అనే సినిమాతో పెద్ద ప్లాప్ మూటగట్టుకున్నారు. ఆ టైంలో ఓ సెన్సిబుల్ లవ్ స్టోరీ చేశారు. అదే ‘నువ్వు వస్తావని’ (Nuvvu Vasthavani). వి.ఆర్.ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో వచ్చిన ‘తూళ్ళత మానముమ్ తుళ్ళుమ్’ అనే సినిమాకి రీమేక్. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్లో నాగార్జున కనిపించారు.
ఎస్.ఎ. రాజ్ కుమార్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. 2000 వ సంవత్సరం ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 5.50 cr |
సీడెడ్ | 2.50 cr |
ఉత్తరాంధ్ర | 1.80 cr |
ఈస్ట్ | 0.88 cr |
వెస్ట్ | 0.75 cr |
గుంటూరు | 0.97 cr |
కృష్ణా | 0.90 cr |
నెల్లూరు | 0.55 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 13.40 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.70 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 14.10 cr |
‘నువ్వు వస్తావని’ (Nuvvu Vasthavani) సినిమా రూ.7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా ఏకంగా రూ.14.1 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తంగా బయ్యర్స్ కి రూ.7.1 కోట్ల లాభాలు అందించి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.