గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పెద్ది(Peddi).. మొదటి గ్లింప్స్‌తోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన ‘ఫస్ట్ షాట్’ వీడియో చూస్తేనే స్పష్టమవుతోంది.. ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, ఒక విలక్షణమైన ఎమోషనల్ కథతో రూపొందుతోందని. బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చరణ్ పూర్తిగా డిఫరెంట్ గెటప్‌తో ఆకట్టుకుంటున్నారు. గుబురు గడ్డం, చెవికి రింగ్, రెడ్ స్ట్రిప్ షర్ట్, శరీరంలో కోపాన్ని ప్రతిబింబించే లుక్‌తో ఈసారి చరణ్ చాలా మాస్‌గా కనిపిస్తున్నారు.
గ్లింప్స్ మొదటి ఫ్రేమ్ నుంచే చరణ్ పరుగు ప్రారంభించి చివరికి క్రికెట్ ఫీల్డ్‌లో బంతిని ఔట్ ఆఫ్ ది గ్రౌండ్ కొట్టడం మరో హైలెట్. ఆ ఒక్క శాట్ చాలు.. ఈ పాత్రకు ఆయన ఎంతగా శ్రమించారో అర్థమవుతుంది. చరణ్ భాష, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, క్రీడాకారుడిగా కనిపించే స్టాన్స్ అన్నీ సినిమాలో ఎంత హైపర్ ఎనర్జీ ఉంటుందో హింట్ ఇస్తున్నాయి. బుచ్చిబాబు తన మొదటి సినిమాతోనే న్యాచురల్ ఎమోషన్స్, రూరల్ బ్యాక్‌డ్రాప్‌ను మెప్పించేలా చూపించగా.. ఇప్పుడు చరణ్‌తో కలిసి మరింత గొప్ప స్థాయిలో ప్రయోగం చేస్తున్నట్టున్నారు.
విజువల్స్ డైరెక్టర్ రత్నవేలు (R. Rathnavelu) క్లాస్ హై రేంజ్ అన్నట్టుగా ఉంటే.. ఏఆర్ రెహమాన్ (A.R.Rahman) సంగీతం సినిమాకు పాన్ ఇండియా స్థాయిని తెచ్చేలా ఉంది. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ (Sukumar) రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. వెంకట సతీష్ కిలారు (Venkatesh Kilaru) నిర్మిస్తున్న ఈ సినిమాను (Peddi) ఇండియన్ సినిమా రేంజ్‌లో ఓ బలమైన మాస్, స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దుతున్నారు.
ఇక రిలీజ్ డేట్ విషయానికి వస్తే.. 2026 మార్చి 27న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ ఫస్ట్ షాట్ గ్లింప్స్‌తో పెద్ది సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. చరణ్ నటన, బుచ్చిబాబు టేకింగ్, టెక్నికల్ స్టాండర్డ్స్ అన్నీ చూస్తుంటే.. ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బేస్డ్ విజువల్ వండర్ అవుతుందనిపిస్తోంది. ఇప్పుడే ఈ స్థాయి రియాక్షన్ వస్తే.. ఫస్ట్ టీజర్, ట్రైలర్ వస్తే ఇంకెంత రచ్చ అవుతుందో చూడాలి.