Oke Oka Jeevitham Collections: 6వ రోజు కూడా ‘ఒకే ఒక జీవితం’ బాగానే కలెక్ట్ చేసింది..!

‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ వంటి 6 సినిమాలు ప్లాపులు అవ్వడంతో శర్వానంద్ రేసులో కాస్త వెనక్కి పడ్డాడు. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలనే ఉద్దేశంతో ‘ఒకే ఒక జీవితం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది అతనికి 30వ సినిమా కావడం విశేషం.! నూతన దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు.

సెప్టెంబర్ 9న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.కానీ మొదట ఈ సినిమా పై అంచనాలు లేకపోవడంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. కానీ రెండో రోజు నుండి పికప్ అయ్యింది.వీక్ డేస్ లో కూడా ఈ మూవీ పర్వాలేదు అనిపిస్తుంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే:

నైజాం 2.33 cr
సీడెడ్ 0.38 cr
ఉత్తరాంధ్ర 0.50 cr
ఈస్ట్ 0.35 cr
వెస్ట్ 0.24 cr
గుంటూరు 0.31 cr
కృష్ణా 0.29 cr
నెల్లూరు 0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 4.57 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.89 cr
ఓవర్సీస్ 1.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.86 cr

‘ఒకే ఒక జీవితం’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.10 కోట్లు.6 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.6.86 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.3.14 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీక్ డేస్ లో కూడా ఈ మూవీ బాగానే పెర్ఫామ్ చేస్తుంది. రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంటే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus