Oke Oka Jeevitham: ఆ విషయంలో శర్వా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన శర్వానంద్ కు ఈ మధ్య కాలంలో వరుస షాకులు తగులుతున్నాయనే సంగతి తెలిసిందే. శతమానం భవతి, మహానుభావుడు విజయాల తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ను సొంతం చేసుకోవడంలో శర్వానంద్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శర్వానంద్ గత సినిమా ఆడవాళ్లు మీకు జోహార్లు ఫుల్ రన్ లో భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సినిమా ఫెయిలైంది.

అయితే ఒకే ఒక జీవితం సినిమాతో ఈ నెల 9వ తేదీన శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు బుకింగ్స్ మొదలైనా ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేదు. సెన్సార్ సభ్యుల నుంచి క్లీన్ యూ సర్టిఫికెట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన రేంజ్ లో లేవు. అయితే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో థియేటర్లు మాత్రం దొరికాయని తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఈ సినిమా స్పెషల్ సెలబ్రిటీ ప్రీమియర్ వేయగా టాలీవుడ్ డైరెక్టర్లు,

పలువురు సినీ ప్రముఖులు ఈ షోకు హాజరయ్యారు. సినిమాను చూసిన సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సినిమాకు పాజిటివ్ గా పోస్టులు పెడితే సినిమాకు ప్లస్ అవుతుంది. సినిమా చూసిన సెలబ్రిటీల నుంచి సినిమా కాన్సెప్ట్ బాగుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మీడియాకు కూడా సినిమా రిలీజ్ కు ముందురోజే షో వేయబోతున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. శర్వానంద్ ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాసినిమాకు శర్వానంద్ రేంజ్ పెరుగుతుండగా శర్వానంద్ కు కొత్త సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అయితే స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో శర్వానంద్ నటిస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. శర్వానంద్ ఒకే ఒక జీవితం ప్రమోషన్స్ లో వేగం పెంచాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus