Allu Arjun Remuneration: సందీప్ సినిమాకు బన్నీ ఆ రేంజ్ లో తీసుకుంటున్నారా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస విజయాలతో విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బన్నీ కెరీర్ ను కొనసాగిస్తుండగా బన్నీ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందనే సంగతి తెలిసిందే. టీ సిరీస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా ప్రభాస్ ను మించి బన్నీ రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం బన్నీ పారితోషికం ఏకంగా 125 కోట్ల రూపాయలుగా ఉంది.

తొలి హిందీ మూవీ కోసం అల్లు అర్జున్ ఈ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారు. ఇతర టాలీవుడ్ హీరోలు ప్రస్తుతం ఒక్కో ప్రాజెక్ట్ కు 100 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో మార్కెట్ పెరగడంతో బన్నీ ఈ రేంజ్ లో తీసుకుంటున్నారు. పుష్ప2 సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఛార్జ్ చేస్తున్న బన్నీ ఈ సినిమా విడుదల కాకుండానే పారితోషికం పెంచేశారు. త్రివిక్రమ్ సినిమాకు బన్నీ ఏ రేంజ్ లో డిమాండ్ చేస్తారో చూడాల్సి ఉంది.

పారితోషికాలను పెంచి సినిమాలు హిట్టైతే ఏ సమస్య లేకపోయినా సినిమాలు ఫ్లాపైతే మాత్రం నిర్మాతలపై ఊహించని స్థాయిలో భారం పడుతుంది. ఒక్క సినిమా ఫ్లాపైనా పెద్దపెద్ద బ్యానర్లు సైతం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. రెమ్యునరేషన్ల విషయంలో హీరోలు ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు పాన్ ఇండియా మార్కెట్ లో కూడా సత్తా చాటుతున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోల పారితోషికాలు రాబోయే రోజుల్లో 200 కోట్ల రూపాయలకు చేరుతాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ స్టార్స్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. అల్లు అర్జున్ తర్వాత ప్రాజెక్ట్ లు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus