బండ్ల గణేష్ ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించాడు. అలా అని ఇతను గొప్ప కమెడియన్ ఏమీ కాదు. కానీ సడెన్ గా నిర్మాతగా మారాడు. ఏకంగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ వంటి బడా స్టార్లతో సినిమాలు తీసాడు. సడెన్ గా ఉన్నట్టు ఉండి.. సినిమాలు నిర్మించడం మానేసి, కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని ఎవ్వరూ ఊహించని విధంగా పాలిటిక్స్ కు ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా ఇతని ప్రయాణం ఎక్కువ రోజులు సాగలేదు. పైగా పెద్ద జోకర్ అయ్యాడు అనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇతను మాట్లాడే మాటలు కూడా అలా ఉంటాయి లెండి. ఇతను మాట్లాడితేనే కాదు..
ట్వీట్ చేసినా సెన్సేషనే..! ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఓ నెటిజెన్ పోస్ట్ వేస్తే..దానికి లైక్ కొట్టి, ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడు. ఇప్పుడు కూడా అలాంటి తప్పే ఒకటి చేసాడు. విషయం ఏమిటంటే.. కరోనా మళ్ళీ విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు నెలకొల్పిన సంగతి తెలిసిందే. మాస్క్ పెట్టుకోని కారణంగా ఓ వ్యక్తికి పోలీసులు రూ. 2 వేలు ఫైన్ వేశారు.ఆ రిసిప్ట్‌ను బండ్ల గణేష్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసి అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపాడు. అందులో తప్పేమి లేదు.. కాకపోతే wear maskకు బదులు Where mask అని తప్పుగా రాసాడు.
దానికి నెటిజన్లు ఓ ఆట ఆడేసుకున్నారు. తప్పు తెలుసుకున్న బండ్లన్న దానిని చేంజ్ చేసాడు. కాకపోతే ఈసారి ware mask అని రాసాడు. రెండోసారి కూడా అలాంటి తప్పే చెయ్యడంతో బండ్ల గణేష్ ను మళ్ళీ ఆడేసుకున్నారు నెటిజన్లు. ‘సోషల్ మీడియా కోసం ఓ మనిషిని పెట్టించుకో’, ‘నీ బట్లర్ ఇంగ్లీష్ ను చూస్తుంటే మాకొచ్చిన ఇంగ్లీష్ కూడా మర్చిపోయేలా ఉన్నాం’ అంటూ కామెంట్లతో దండయాత్రలు చేశారు.
1
2
3
Most Recommended Video
రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!