Chiranjeevi, Mahesh Babu: చిరు,మహేష్ సినిమాలకి ఆ రెండూ పెద్ద సమస్యలే..!

  • April 20, 2022 / 10:38 AM IST

కరోనా కారణంగా వాయిదా పడిన పెద్ద సినిమాలు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టు రిలీజ్ అవుతున్నాయి. భీమ్లా నాయక్, రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, కే.జి.ఎఫ్ 2 వంటి సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. ఒక్క రాధే శ్యామ్ తప్ప అన్నీ బాక్సాఫీస్ వద్ద రాఫ్ఫాడించిన సినిమాలే..! ఇదే ఫీస్ట్ సమ్మర్ ఫినిష్ అయ్యే వరకు ఉంటుందని … అభిమానులు ఆశిస్తున్నారు. మరో 10 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఆచార్య రిలీజ్ కావాల్సి ఉంది.

Click Here To Watch NOW

ఇది 2020 లో రావాల్సిన మూవీ. షూటింగ్ ప్రారంభం నుండీ ఈ మూవీకి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే వచ్చింది. ఎట్టకేలకు షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని ఏప్రిల్ 29 న రిలీజ్ కాబోతుంది ఈ మూవీ. దీని తర్వాత సరిగ్గా రెండు వారాల తర్వాత మహేష్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ కాబోతుంది. ఇవి రెండు రిలీజ్ అయితే పెండింగ్ పెద్ద ప్రాజెక్టులు అన్నీ పూర్తయిపోయినట్టే..!

కానీ ఇప్పుడు వీటికి కరోనా భయం పట్టుకుంది. గత రెండు రోజులుగా దేశంలో కరోనా కేసులు ఊహించని విధంగా పెరిగాయి. కాబట్టి 4వ వేవ్ మొదలయినట్టే అని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని తీవ్రత ఎంత వరకు ఉంటుంది అనేది ఇంకా తెలీదు. థర్డ్ వేవ్ లానే ఇది కూడా చప్పుడు చేయకుండా వెళ్ళిపోతుంది అని, లాక్ డౌన్ వంటివి అవసరం లేదని అంతా ధీమాగా ఉన్నారు.

కాబట్టి ఆచార్య కి కానీ, సర్కారు వారికి రిలీజ్ కు ఇబ్బంది లేదు. కాకపోతే జనాల్లో ఏమైనా కరోనా భయం మొదలైనా, టికెట్ రేట్లు భారీగా పెంచినా ఈ సినిమాలను జనాలు ఓటిటిలో చూసుకోవచ్చు అనే నిర్ణయానికి వచ్చే ప్రమాదం ఉంది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus