దర్శకరత్న,ఒక్కప్పటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు వంటి దివంగత దాసరి నారాయణ రావు గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజకీయాల్లో కూడా సత్తా చాటిన వారాయన. 2017 లో ఆయన కాలం చేయడంతో ఓ విధంగా టాలీవుడ్ కు తీరని లోటనే చెప్పాలి. ఆయన స్థానాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ భర్తీ చేయలేదు. ఇదిలా ఉండగా… గతంలో ఇండస్ట్రీలో ఎవరికి ఏ సమస్య వచ్చినా దాసరి గారి వద్దకు తీసుకెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఆయన కుటుంబంలోనే ఎన్నో సమస్యలు వస్తున్నా..
వాటి గురించి పట్టించుకుంటున్న వాళ్ళు లేరు.అది ఒక వార్తగా మాత్రమే మిగిలిపోతుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆయన ఇంటికి కోర్టు నోటీసులు రావడం చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే… దాసరి నారాయణరావుగారి తనయులు అరుణ్, ప్రభులు అందరికీ సుపరిచితమే. వీరికి ఆర్డర్ 34, సీపీసీ సెక్షన్ 151 CPC క్రింద సిటీ సివిల్ కోర్టు… నోటీసులు జారీ చేసింది. వ్యాపార లావాదేవీల్లో జరిగిన అవకతవకల కారణంగా వీరికి కోర్టు నోటీసులు అందినట్టు సమాచారం.
ఓ ప్లాంట్ నిర్మాణం రీత్యా సోమశేఖర్ రావు అనే బిజినెస్మెన్ వద్ద వీరు రూ.2కోట్ల 11 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారట. కానీ ప్రభు, అరుణ్‌లు ఇప్పటివరకు తిరిగి చెల్లించట్లేదంటూ కోర్టులో పిటిషన్ దాఖలవ్వడంతో నోటీసులు పంపినట్టు సమాచారం.సోమశేఖర్ దగ్గర ప్రభు, అరుణ్ లు తీసుకున్న మొత్తాన్ని నవంబర్ 15కి ఎట్టిపరిస్థితిలోనూ చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!