Dhanush, Venky Atluri: టైటిల్ కూడా ఫిక్స్ చేసేశారు.. వెంకీ అట్లూరి సూపర్ ఫాస్ట్ అబ్బా..!

Ad not loaded.

ధనుష్ (Dhanush)  ప్రస్తుతం ‘కుబేర’ (Kubera) సినిమాలో నటిస్తూనే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. ఈ లిస్టులో మన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) ప్రాజెక్టు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ధనుష్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబో అనగానే అందరికీ ‘సార్’ (Sir) సినిమా గుర్తుకొస్తుంది. 2023 స్టార్టింగ్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పటివరకు ‘ప్రేమకథా సినిమాలు మాత్రమే తీస్తాడు’ అనుకున్న వెంకీ.. ‘సార్’ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఒకప్పుడు ఎలా ఉండేది..

Dhanush, Venky Atluri:

ఇప్పుడు ఎలా ఉంటుంది.ప్రైవేట్ స్కూల్స్ అధినేతలు.. గవర్నమెంట్ స్కూల్స్ ని తొక్కేయడానికి ఎలాంటి స్కామ్..లు చేశారు, చేస్తున్నారు.. అనే అంశం చుట్టూ.. ‘సార్’ కథ నడుస్తుంది. అది ఆడియన్స్ కి మంచి మెసేజ్ ఇచ్చింది అని చెప్పాలి. ‘సార్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. నిర్మాతకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. సో ఇది ఇంట్రెస్టింగ్ కాంబోనే అని చెప్పాలి. ధనుష్ కూడా వెంకీని నమ్మి వెంటనే ఇంకో సినిమా చేయడానికి రెడీ అని..

ఆ సినిమా టైంలోనే చెప్పాడు. మొత్తానికి అది నిజం కాబోతుంది. ఇది కూడా మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్టు అనే తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్టుకి ‘హానెస్ట్ రాజ్’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించి పెట్టారట. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది. మరోపక్క సూర్యతో (Suriya) కూడా వెంకీ అట్లూరి ఒక సినిమా చేయబోతున్నాడు. ఇది కంప్లీట్ అయ్యాకే ‘హానెస్ట్ రాజ్’ సెట్స్ పైకి వెళ్తుంది అని తెలుస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus